Telangana Election: అచ్చంపేటలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్లదాడి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె్ల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలంకొంది.

అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని వెళ్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు తారసపడ్డాయి. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరస్పరం దూషణకు దిగటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అదే సమయంలోనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై గుంపులో నుంచి ఒకరు రాయితో దాడికి పాల్పడ్డారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణనే స్వయంగా రాయితో కొట్టారని గువ్వల బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిలో గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కిందపడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన సమీప ఆసుపత్రిలోప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు.అయితే ఓటమి భయంతోనే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటికి మొన్న దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ర్యాలీపై రాళ్లదాడి చేశారు. తాజాగా గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు దారుణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ దాడిని ఖండించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..