Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: పాలిటిక్స్‌‌లో షార్ట్‌ సర్క్యూట్.. బీఆర్ఎస్‌కు ప్రధానాస్త్రంగా కరెంట్ ఇష్యూ.. కాంగ్రెస్ కౌంటర్..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పక్కా వ్యూహాలతో.. కీలక అస్త్రాలతో మాటల తూటాలు పేలుస్తున్నాయి. దీంతో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ముట్టుకుంటే షాక్ కొట్టేలా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఒకటంటే.. రెండు అంటాం.. అవసరమైతే మూడు కూడా అంటాం అంటూ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి.

Telangana Election: పాలిటిక్స్‌‌లో షార్ట్‌ సర్క్యూట్.. బీఆర్ఎస్‌కు ప్రధానాస్త్రంగా కరెంట్ ఇష్యూ.. కాంగ్రెస్ కౌంటర్..
Congress Brs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2023 | 8:39 AM

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పక్కా వ్యూహాలతో.. కీలక అస్త్రాలతో మాటల తూటాలు పేలుస్తున్నాయి. దీంతో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ముట్టుకుంటే షాక్ కొట్టేలా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఒకటంటే.. రెండు అంటాం.. అవసరమైతే మూడు కూడా అంటాం అంటూ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇలా.. తెలంగాణలో పవర్ పాలిటిక్స్‌.. షార్ట్‌ సర్క్యూట్ వరకు వెళ్లి కాకరేపుతున్నాయి. ఈ కరెంట్ ఎఫైర్‌ని అందిపుచ్చుకున్న గులాబీదండు.. కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది. అంతేకాదు.. గులాబీసేనకు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే ప్రధానాస్త్రంగా మారింది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ ఇదే డ్యూటీ. కాంగ్రెస్‌ నేతల కరెంట్ కామెంట్స్‌పై మండిపడుతూనే ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరెంట్‌ మంటలు హైవోల్టేజ్‌ను తలపిస్తున్నాయి.

తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తమ ప్రభుత్వ హయాంలో రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి బోల్తా పడ్డారని బీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పిస్తోంది. ఇదే అస్త్రాన్ని ఎంచుకున్న భారత్ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు.. విపక్ష పార్టీపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ చెప్పే 3 గంటల కరెంట్ కావాలా..? లేక 24 గంటలు ఇచ్చే ప్రభుత్వం కావాలా..? అంటూ ప్రతి సభలో సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

తెలంగాణలో రైతులకు ఒక ఎకరానికి గంట చొప్పున మూడు గంటల పాటు విద్యుత్ ఇస్తే చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం ఉంటుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హీట్ పుట్టించాయి. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ సైతం ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. రేవంత్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదంటూ కేటీఆర్‌ మరోసారి విమర్శలు చేశారు.

కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు..

తెలంగాణలో ఎక్కడా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడంలేదని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్‌ విసిరారు. అయితే ఈ ఆరోపణలను ఖండించారు మంత్రి హరీష్‌రావు. 3 గంటలు కరెంట్ చాలన్న కాంగ్రెస్‌ను నమ్మితే.. కర్నాటక మాదిరిగా తెలంగాణ అంధకారంగా మారుతుందని హరీష్‌రావు హెచ్చరించారు.

మొత్తంగా.. తెలంగాణలో కరెంట్‌ రాజకీయం కాకరేపుతోంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరెంట్‌ మంటలు హైవోల్టేజ్‌ను తలపిస్తున్నాయి. మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు కరెంటే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తూ.. ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలో పవర్ పాలిటిక్స్ మున్ముందు ఎవరికీ అనుకూలంగా మారుతాయనేది చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..