Tollywood : అన్నయ్యతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్..
దశాబ్దకాలంగా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్లలో ఈ బూరె బుగ్గల బుజ్జాయి ఒకరు. ఈ క్యూట్ చిన్నారికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె నటనకు అడియన్స్ ఫిదా కావాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయికగా రాణిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా ?.. కొద్ది కాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తిరిగి బిగ్ స్క్రీన్ పై అలరిస్తోంది. ఇటీవల ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. గుర్తుపట్టారా ?. తను తెలుగు సినిమా లేడీ సూపర్ స్టార్
దక్షిణ చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో చిత్రాల్లో నటించారు. స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ముద్దుగుమ్మలు కొందరు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉండగా.. దశాబ్దకాలంగా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మరికొందరు. అందులో ఈ బూరె బుగ్గల బుజ్జాయి ఒకరు. ఈ క్యూట్ చిన్నారికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె నటనకు అడియన్స్ ఫిదా కావాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయికగా రాణిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా ?.. కొద్ది కాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తిరిగి బిగ్ స్క్రీన్ పై అలరిస్తోంది. ఇటీవల ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. గుర్తుపట్టారా ?. తను తెలుగు సినిమా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి. రెండు దశాబ్దాల పాటు తిరుగులేని నిబద్ధతతో సినీ పరిశ్రమలో తన ఉనికిని పదిలం చేసుకుంది. అనుష్క చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఆమె తన ఇద్దరు సోదరుల మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ నిల్చుంది.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి కాగా.. సూపర్ సినిమా చిత్రీకరణ సమయంలో పూరి, నాగార్జున తనకు అనుష్క అని పేరు మార్చారు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. పీరియాడికల్ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌ల నుండి యాక్షన్-ప్యాక్డ్ పాత్రలు, అలాగే రొమాంటిక్ కామెడీల వరకు అనుష్క అనేక సినిమాల్లో నటించింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ అద్భుతంగా నటించింది. ఆమె నటించిన అరుంధతి సినిమా గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో జేజమ్మగా స్థానం సంపాదించుకుంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ఇటీవలే స్వీటీ తన 42వ పుట్టినరోజును జరుపుకుంది. బాహుబలి సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ-ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహించగా.. ఇందులో మురళీ శర్మ, జయసుధ ముఖ్యమైన పాత్రలు పోషించారు. చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన అనుష్క.. ఇకపై మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక అనుష్క కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ భాగమతి సినిమాకు సీక్వెల్ రాబోతుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.