Geetha Shankaram: వెండితెరపై హీరోగా ‘గుప్పెడంత మనసు’ రిషి సర్.. ‘గీతా శంకరం’ ఫస్ట్ లుక్ చూశారా ?.

ప్రస్తుతం భారీ టీఆర్పీ రేటింగ్‏తో టాప్ స్థానంలో ఈ సీరియల్ దూసుకుపోతుండగా.. రిషికి తెలుగు అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బుల్లితెరపై కాకుండా వెండితెరపై హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు రిషి. అతని అసలు పేరు ముకేష్ గౌడ. కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో రూపొందిస్తున్న గీతా శంకరం సినిమాలో ముకేష్ హీరోగా నటిస్తున్నారు. అతని జోడిగా ప్రియాంక శర్మ నటిస్తుంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.దేవానంద్ తెరకెక్కిస్తున్నారు.

Geetha Shankaram: వెండితెరపై హీరోగా 'గుప్పెడంత మనసు' రిషి సర్.. 'గీతా శంకరం' ఫస్ట్ లుక్ చూశారా ?.
Mukesh Gowda
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 12, 2023 | 7:32 AM

బుల్లితెరపై అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సీరియల్ స్టార్ అంటే రిషి సర్ మాత్రమే. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇందులో డీబీఎస్ కాలేజీ ఎండీ రిషి క్యారెక్టర్‏తో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భారీ టీఆర్పీ రేటింగ్‏తో టాప్ స్థానంలో ఈ సీరియల్ దూసుకుపోతుండగా.. రిషికి తెలుగు అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బుల్లితెరపై కాకుండా వెండితెరపై హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు రిషి. అతని అసలు పేరు ముకేష్ గౌడ. కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో రూపొందిస్తున్న గీతా శంకరం సినిమాలో ముకేష్ హీరోగా నటిస్తున్నారు. అతని జోడిగా ప్రియాంక శర్మ నటిస్తుంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.దేవానంద్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందమైన ప్రేమకథగా ఈ మూవీ రాబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఈనెల 14 నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ముకేష్ గౌడ మాట్లాడుతూ.. దీపావళి కానుకగా తన ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ కావడం సంతోషంగా ఉందన్నారు. తనను హీరోగా సెలక్ట్ చేసినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. లవ్ అండ్ ఎఫక్షన్ తో రాబోతున్న ఈ సినిమాతో వెండితెరపై హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉందని.. గుప్పెడంత మనసు సీరియల్‏తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నానని.. ఇప్పుడు హీరోగాను మంచి పేరు తెచ్చుకుంటానని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. గీతా శంకరం సినిమాలో కథానాయికగా నటిస్తోన్న ప్రియాంక శర్మ.. గతంలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో మెన్ టూ, తంతిరం అనే సినిమాల్లో మెరిసింది. రెండేళ్లుగా ఈ ప్రేమకథను తెరకెక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేశామని.. ఇప్పుడు ఫలించాయని .. అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కుతుందని అన్నారు డైరెక్టర్ రుద్ర.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ