గృహిణి పాత్ర నుంచి నాయకురాలిగా.. హోంశాఖ మంత్రిగా రికార్డు.. సబితా రాజకీయ ప్రస్థానంలో మరెన్నో.!
Sabitha Indra Reddy Telangana Election 2023: ఆ సమయంలో గృహిణి పాత్రలో నలుగురుని పలకరిస్తూ.. ఎంతో ఆదరణ పొందిన సబితా ఇంద్రారెడ్డి.. అనూహ్యంగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి మరణం.. ఆయన భార్య సబితా ఇంద్రారెడ్డిని ఊహించని మార్గంలోకి నెట్టేసింది. గృహిణి పాత్ర నుంచి..

ఆ సమయంలో గృహిణి పాత్రలో నలుగురుని పలకరిస్తూ.. ఎంతో ఆదరణ పొందిన సబితా ఇంద్రారెడ్డి.. అనూహ్యంగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి మరణం.. ఆయన భార్య సబితా ఇంద్రారెడ్డిని ఊహించని మార్గంలోకి నెట్టేసింది. గృహిణి పాత్ర నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. పలువురి సీనియర్ నేతల అంచనాలను మించి.. అందనంత ఎత్తుకు ఎదగడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు సబితా ఇంద్రారెడ్డి. 2000లో చేవెళ్ల నియోజకవర్గ ఉపఎన్నికల్లో విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి.. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యి.. వారి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చేవారు.
2004లోనూ చేవెళ్ల నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మహేశ్వరం నుంచి పోటీ చేశారు. 2004-09 మధ్య గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి. 2009 వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రి పదవిని చేపట్టి.. భారతదేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డిని ఎప్పుడూ చెల్లెమ్మగా అభివర్ణించే వైఎస్ఆర్.. తన పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. అలాగే ఏ కార్యక్రమం అయినా కూడా ఆమె నియోజకవర్గం నుంచే చేపట్టేవారు.. దీంతో సబితా ఇంద్రారెడ్డి రాజకీయ కెరీర్‌కు అది మరింత బూస్టప్‌నిచ్చేది.
2018లో ఎన్నికల్లో మరోసారి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి.. టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్)లోకి చేరిన సబితాకు మంత్రిపదవిని కట్టబెట్టారు సీఎం కేసీఆర్. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు సబితా ఇంద్రారెడ్డి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి మహిళా మంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు సబితా ఇంద్రారెడ్డి. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో మహేశ్వరం స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి.
సర్వేలు చెబుతున్నాయి..
మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ తరపున సబితా ఇంద్రారెడ్డి బరిలో ఉండగా.. అటు హేమాహేమీలైన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి, శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ కొనసాగుతుందని సర్వేలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..