Telangana Election: విభిన్న రీతిలో ఎన్నికల ప్రచారం.. ఓటు వేయాలంటూ ఆహ్వాన శుభపత్రికల పంపిణీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది. ప్రచారానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారంతో పాటు, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ పెద్దలు, పార్టీ అగ్రనేతలు అందరూ నిర్విరామంగా ప్రచారం పర్వంలో మునిగిపోయారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది. ప్రచారానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారంతో పాటు, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ పెద్దలు, పార్టీ అగ్రనేతలు అందరూ నిర్విరామంగా ప్రచారం పర్వంలో మునిగిపోయారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ప్రచారంలో భాగంగా అందరూ తమ గుర్తును, చేయబోయే పనిని వివరిస్తూ.. కరపత్రాలు పంచుతుంటారు. ఓ నేత మాత్రం వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ ఓట్ల పండుగకు ప్రత్యేక ఆహ్వాన పత్రికను పంచుతున్నారు. ఈ స్పెషల్ ఇన్విటేషన్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓ కార్పొరేటర్, ఆమె భర్త పోలింగ్ రోజు ఓటుహక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం చేప ట్టారు. అందరిలా పార్టీకి చెందిన మెనిఫెస్టోతో కరపత్రాన్ని ముద్రించి పంచితే… దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అనుకున్నారో ఏమో.. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ.. ఆ ఓటును కారు గుర్తుకే వేసి తమ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను గెలిపించాలంటూ.. ఓ ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బరిలో దిగారు. ఆయనను గెలిపించాలని కోరుతూ.. ఆయన తరపున 28వ డివిజన్ కార్పోరేటర్ గందె కల్పన నవీన్ వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు. అచ్చం వివాహ ఆహ్వాన పత్రిక లాగా ఓటు హక్కు వినియోగ ఆహ్వాన శుభపత్రికను తయారు చేశారు నవీన్ దంపతులు. ఆహ్వాన పత్రికతో పాటు బీఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టో, అభివృద్ధిపై కరపత్రాలు ముద్రించారు. వరంగల్ బట్టల బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆహ్వాన పత్రికకు పూజలు చేయించి వారి డివిజన్లో ఇంటింటికి తిరిగి ఆహ్వాన పత్రిక అందజేస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నవరంబర్ 30న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి నన్నపునేని నరేందర్ కు ఓటేసి గెలిపించాలని నవీన్ దంపతులు కోరుతున్నారు.
ఈ ఓట్ల పండుగలో.. తమ విలువైన ఓటును కారు గుర్తుకు వేసి.. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆశీర్వదించిన అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను గెలిపించాలని గందె కల్పన నవీన్ కోరుతున్నారు. కాగా.. ఇంతవరకు ఇలాంటి ఆహ్వాన పత్రిక ఎప్పుడూ చూడని ప్రజలు.. ఎంతో ఆసక్తిగా దీన్ని చదువుతున్నారు.
మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…