AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతమంటున్న తెలంగాణ యువత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్నవారే ఒక కోటి 67 లక్షల మంది. అంటే ఈ ఎన్నికల్లో యువతదే ప్రధాన పాత్ర ఉండనుంది. అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇక కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నవారు ఎక్కువగానే ఉన్నారు. మొదటిసారి ఓట వేయడానికి జోష్‌లో ఉన్న యువత వివిధ అంశాలతో ముందుకెళ్తున్నారు..

Telangana ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతమంటున్న తెలంగాణ యువత
Young Voters
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Nov 17, 2023 | 11:24 AM

Share

తెలంగాణలో ఎలక్షన్ హీట్ వేవ్ వీస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో యువత పాత్ర కీలకం కానుంది.. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు సగానికి పైగా తెలంగాణలో ఉన్నారు. అయితే ఈసారి 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు కొత్తగా ఓటు పొందిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఈ యువత ఎలక్షన్స్‌పై ఏమనుకుంటున్నారు. ఏఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయనున్నారు. అన్నదీ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్నవారే ఒక కోటి 67 లక్షల మంది. అంటే ఈ ఎన్నికల్లో యువతదే ప్రధాన పాత్ర ఉండనుంది. అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇక కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నవారు ఎక్కువగానే ఉన్నారు. మొదటిసారి ఓట వేయడానికి జోష్‌లో ఉన్న యువత వివిధ అంశాలతో ముందుకెళ్తున్నారు..

మొదటి సారిగా ఓటు హక్కు వచ్చిన యువత అంతకు మించి అన్నట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఓట్లు నమోదు చేయడంలో ఎలక్షన్ కమీషన్ కల్పించిన ప్రచారంతో ఎక్కువ మంది ఓటర్స్ ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకున్నారు. గతంలో యువత ఓట్లు ఎక్కువగా ఉన్నా, పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసింది మాత్రం తక్కువే. పోలింగ్ డే ను హాలిడే గా భావించి టూర్స్ ట్రిప్స్ వేసే వారు లేకపోలేదు. కానీ ఈసారి మాత్రం తమకు వచ్చిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువత..

యువత పాత్ర ఎన్నికలతో పాటు ప్రజాస్వామ్యంలో కీలకమనే అంశంపైన కాలేజీల్లో కూడా లెక్చరర్స్ చెబుతున్నారంటున్నారు యూత్. సపరేట్‌గా యూత్‌కి రాజకీయ పార్టీ ఎలాంటి ఎజెండాని, హామీలను ప్రకటించకపోయినా, ఉన్నవారిలో ది బెస్ట్ అని ఎవరో చూసి ఓటు వేస్తామంటున్నారు. ఎవరో చెబితే, పేరెంట్స్ చెబితే వినకుండా తమకు తాము అలోచించి ఓటు హక్కు వినియోగిస్తామంటున్నారు.

పార్టీలను చూసి కాకుండా క్యాండిడేట్స్‌ను చూసి ఓటు వేస్తామంటున్నారు కొందరు యువకులు. స్థానికంగా ఉన్న సమస్యలు తీరాలంటే స్థానిక ఎమ్మెల్యేతోనే సాధ్యం, కాబట్టి క్యాండిడేట్ మంచివాడైతే అతనికే తమ ఓటు అంటున్నారు. డబ్బు, మధ్యంతో ఎంతమంది తమని ప్రలోభపెట్టినా.. వినకుండా తమ విచక్షణతో నచ్చిన అభ్యర్థికే ఓటు వేస్తామని పక్కాగా చెబుతున్నారు యూత్. అభ్యర్థులు, పార్టీలు నచ్చకుంటే నోటాకి అయినా ఓటు వేస్తాం కాని.. వచ్చిన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోమంటున్నారు ప్రజెంట్ యూత్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…