AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Reddy: సీఎం పదవి రేసులో నేను లేను.. జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం పదవి రేసులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. తాను పదవుల రేసులో నేను ఎప్పుడూ లేను.. అదృష్టం ఉంటే అదే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ నరసింహా రావు ప్రధాని అయినట్లుగానే సీఎం పదవి కూడా తనను వరిస్తుందనీ అన్నారు. ప్రజల కోరితే ఆరు నెలల తర్వాత తన కొడుకు రాజీనామా చేస్తే.. నేను..

Jana Reddy: సీఎం పదవి రేసులో నేను లేను.. జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Jana Reddy
M Revan Reddy
| Edited By: Subhash Goud|

Updated on: Oct 17, 2023 | 9:03 PM

Share

తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగిపోయింది. ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థుల జాబితా విడులైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. ఎవరికి వారు సరికొత్త ప్లాన్స్‌ వేస్తున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారని చర్చలు అనేకం జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం పదవి రేసులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. తాను పదవుల రేసులో నేను ఎప్పుడూ లేను.. అదృష్టం ఉంటే అదే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ నరసింహా రావు ప్రధాని అయినట్లుగానే సీఎం పదవి కూడా తనను వరిస్తుందనీ అన్నారు. ప్రజల కోరితే ఆరు నెలల తర్వాత తన కొడుకు రాజీనామా చేస్తే.. నేను ఎమ్మెల్యేగా ఎన్నికవుతాననీ చెప్పారు.

గుర్రంపొడులో బీఆర్ఎస్ చెందిన జడ్పిటిసి గాలి సరిత రవి కుమార్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. మూటలు, మాటల గారెడితో సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు మాయం అవుతుందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు రాష్ట్ర ప్రజలకు భారంగా మారాయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో మూటలతో రాజకీయం చేసే సంస్కృతి బీఆర్ఎస్ తో మొదలైందనీ విమర్శించారు. పథకాలతో గెలవాల్సింది పోయి విచ్చలవిడిగా డబ్బు పంపిణీతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారనీ అన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత సీఎం కేసీఆర్ లేదని ఆయన అన్నారు. తమ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఇక ఆయా పార్టీల నేతలు తమ బలబలాలను రూపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో ఉన్న బడా నేతలు సైతం తెలంగాణకు చేరుకునేందుకు రెడీ అవుతున్నారు. భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఎలాగైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక మూడో సారి కూడా తామే అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ ప్రకటిస్తుండగా, లేదు తాము అధికారంలోకి రావడం ఖాయమంటూ బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు తమ బలాలను నిరూపించుకునందుకు గట్టి ప్లాన్‌లు వేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి