Blue Aadhaar: మీ పిల్లలకు బ్లూ ఆధార్‌ తీసుకున్నారా.? ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటనేగా.?

సాధారణంగా ఆధార్‌ కార్డ్‌ వైట్‌ కలర్‌లో ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం బ్లూ ఆధార్‌ కార్డులను కూడా ప్రవేశపెట్టింది. 2018లో తీసుకొచ్చిన ఈ బ్లూ ఆధార్‌ కార్డు గురించి మీకు తెలుసా.? ఇంతకీ ఏంటీ బ్లూ ఆధార్డ్‌ ఏంటి? దీనిని ఎవరి కోసం తీసుకొచ్చారు.? ఈ కార్డు ద్వారా ఉపయోగం ఏంటి.? లాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Blue Aadhaar: మీ పిల్లలకు బ్లూ ఆధార్‌ తీసుకున్నారా.? ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటనేగా.?
Blue Aadhaar Card
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 17, 2023 | 12:48 PM

ఆధార్‌ కార్డ్.. అన్నింటికీ ఆధారంగా మారిపోయింది. సిమ్‌ కార్డు మొదలు ఇంటి రిజిస్ట్రేషన్‌ వరకు ఆధార్‌ కార్డ్ లేకుండా ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. ప్రతీ చిన్న పనికి ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరిగా మారిపోయింది. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తున్న ఆధార్‌ కార్డు ఇప్పుడు ప్రతీ భారతీయుడికి ఒక గుర్తింపుగా మారిపోయింది.

సాధారణంగా ఆధార్‌ కార్డ్‌ వైట్‌ కలర్‌లో ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం బ్లూ ఆధార్‌ కార్డులను కూడా ప్రవేశపెట్టింది. 2018లో తీసుకొచ్చిన ఈ బ్లూ ఆధార్‌ కార్డు గురించి మీకు తెలుసా.? ఇంతకీ ఏంటీ బ్లూ ఆధార్డ్‌ ఏంటి? దీనిని ఎవరి కోసం తీసుకొచ్చారు.? ఈ కార్డు ద్వారా ఉపయోగం ఏంటి.? లాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం ఉద్దేశించే తీసుకొచ్చిందే ఈ బ్లూ ఆధార్‌ కార్డు. చిన్న పిల్లలకు సైతం ఆధార్‌ కార్డు అనివార్యమవుతోన్న తరుణంలో 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ బ్లూ ఆధార్‌ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డులోనూ వైట్ కార్డులో ఉన్నట్లే 12 నెంబర్లు ఉంటాయి. చిన్నారులు కేవలం 5 ఏళ్ల వయసున్నంత వరకు మాత్రమే ఈ ఆధార్‌ కార్డ్‌ పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ వైట్ ఆధార్‌ కార్డును తీసుకోవాల్సిందే. చిన్నారులకు స్కూల్‌ జాయినింగ్‌ సమయంలో లేదా వారికి సంబంధించి ఏవైనా పాలసీలు చేసే సమయంలో ఈ ఆధార్‌ కార్డు ఉపయోగపడుతుంది.

సాధారణంగా ఆధార్‌ కార్డులో కార్డుదారుడి వేలి ముద్రలు, రెటీనా వివరాలు ఉంటాయి. అయితే బ్లూ ఆధార్‌ కార్డులో ఇలాంటి సమాచారం ఏదీ ఉండదు. చిన్నారులు ఐదేళ్లు నిండిన తర్వాత వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత యూఐడీఏఐకి వేలి ముద్రలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్లూ కార్డును చిన్నారులను స్కూల్‌లో జాయినింగ్ చేసే సమయంలో డాక్యుమెంట్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఇక ఈ బ్లూ ఆధార్‌ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే. చిన్నారుల బర్త్‌ సర్టిఫికేట్‌తో పాటు పేరెంట్స్‌ అడ్రస్‌ ప్రూఫ్‌తో స్థానికంగా ఉన్న ఆధార్‌ కార్డ్‌ నమోదు కేంద్రానికి వెళ్లాలి. అనంతరం దరఖాస్తు ఫామ్‌ను నింపిన తర్వాత సర్టిఫికెట్లను అటాచ్‌ చేసి అందించారు. పేరెంట్స్‌ సైతం తమ ఆధార్‌ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ ఆధార్‌ కోసం పేరెంట్స్‌ తమ మొబైల్‌ నెంబర్లను అందించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో కేవలం చిన్నారి ఫొటోను తీసుకుంటారు. బ్లూ కార్డుపై ఫొటో కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత పేరెంట్స్‌ నెంబర్‌కి కాన్ఫామ్‌ మెసేజ్‌ వస్తుంది. అనంతరం 60 రోజులలోపు బ్లూ ఆధార్‌ కార్డ్‌ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?