Telangana Assembly Session 2022 Highlights: 80,039 పోస్టులను వెంటనే భర్తీ చేస్తాం.. నేటి నుంచే నోటిఫికేషన్..

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 09, 2022 | 2:53 PM

CM KCR Announcement Highlights: నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ కేసీఆర్ టీజర్ వదిలారు. కేసీఆర్ ఏ ప్రకటన చేసినా సరే అది వేల కోట్ల వ్యవహారమే అయ్యే చాన్స్ ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు. ఉద్యోగాల ప్రకటన ఉంటుందా... నిరుద్యోగ భృతి ఉంటుందా

Telangana Assembly Session 2022 Highlights: 80,039  పోస్టులను వెంటనే భర్తీ చేస్తాం.. నేటి నుంచే నోటిఫికేషన్..
Cm Kcr Big Announcement In Telangana Assembly Budget Session 2022

CM KCR Announcement Highlights: టంచనుగా పదికాగానే ఓ ప్రకటన చేస్తా. నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ కేసీఆర్ టీజర్ వదిలారు. కేసీఆర్ ఏ ప్రకటన చేసినా సరే అది వేల కోట్ల వ్యవహారమే అయ్యే చాన్స్ ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు. ఉద్యోగాల ప్రకటన ఉంటుందా… నిరుద్యోగ భృతి ఉంటుందా. లేదంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలో ఉన్నాయో చెప్పి… అన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటిస్తారా? ఆ ఖాళీల భర్తీ పోను ఇంకా నిరుద్యోగ యువత ఉంటే.. వాళ్లకు భృతి కల్పిస్తామంటారా? ఏం చెప్పబోతున్నారు.. పాలసీలో ఏం చెయ్యబోతున్నారు. తెలంగాణ యువత యావత్తూ చాలా ఆశగా ఎదురుచూస్తున్న సమయం ఇది. బుధవారం ఉదయం 10గంటలు.

కేసీఆర్ ప్రకటన దేని గురించో ఆయనే చెప్పేశారు. పక్కాగా నిరుద్యోగం మీదే. ఆ నిరుద్యోగాన్ని రూపుమాపి ఉపాధి కల్పించడానికి ఏం చెయ్యబోతున్నారన్నదే ప్రశ్న. ఒకసారి మొన్నటి బడ్జెట్ కాపీ చూద్దాం. అందులో పక్కాగా ఉన్న మ్యాటర్ కొత్త ఉద్యోగాలకు గాను జీతాల కోసం 3వేల కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీలపై శాఖలవారీగా కేసీఆర్ రివ్యూ నిర్వహించారట కూడా. ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చెయ్యడానికి రెడీగా ఉండాలని కూడా మౌఖికంగా అధికారులకు ఆదేశాలు అందాయని కూడా అంటున్నారు. ఇదే నిజమైతే… కేసీఆర్ ప్రకటన రాష్ట్రంలో ఖాళీల సంఖ్య, శాఖల వారీగా ఖాళీలు, వాటి భర్తీకి నోటిఫికేషన్లు.. అందుకు సంబంధించిన తేదీలతో జాబ్ క్యాలెండర్‌పైనే ఉంటుందనేది అంచనా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలి అని కోరుకోడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నిమాయకాలు. నీళ్ల విషయంలో తెలంగాణ గలగలలు పారుతున్నాయి. నిధుల విషయంలో కేంద్రంతో కొట్లాట మొదటి నుంచీ ఉంటూనే ఉంది. ఇక మిగిలింది నియామకాలు. ఇది తెలంగాణ చేతిలో ఉన్న అంశం. అందుకే టీఆర్‌ఎస్‌ను విపక్షాలు పదేపదే ఉద్యోగ నిమాయకాలపై ప్రశ్నిస్తూ వస్తున్నాయి.

తెలంగాణలో శాఖల వారీగా ఉన్న ఖాళీలపై సర్వే నిర్వహించి ఆర్థిక శాఖ గత నెల ఓ రిపోర్ట్‌ను కేబినెట్‌కు అందించింది. అందులో లెక్కల ప్రకారం… మొత్తం 28శాఖల్లో 56వేల 979 ఖాళీలు ఉన్నట్లు తేల్చింది. అందులో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు 44వేల 22, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్ ఇన్‌ ఎయిడ్‌ కింద 12వేల 957 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ DR అంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద అవకాశం ఉన్న ఖాళీలు. కేబినెట్‌కు అందిన రిపోర్ట్‌ ప్రకారం.. అత్యధికంగా ఖాళీలు ఉన్నది పోలీసు శాఖ. అందులో 21వేల 507 పోస్టులు భర్తీకి అవకాశం ఉంది. సంక్షేమ గురుకులాల్లో 7వేల 701 ఖాళీలున్నాయి. వైద్యశాఖలో 3వేల 3వందల 53 భర్తీ చెయ్యొచ్చు. డిగ్రీ లెక్చరర్లు ఒకవెయ్యి 62మంది, జూనియర్ లెక్చరర్లు 9వందల మంది కావాలి. రెవిన్యూ శాఖలో ఉన్నపళంగా 305 మందిని తీసుకోవచ్చు. పంచాయతీ రాజ్‌లో 894, నీటిపారుదల శాఖలో 721, అటవీశాఖలో 856, వ్యవసాయ శాఖలో 200, పశువైద్య విభాగంలో 244, రవాణా శాఖలో 108 ఖాళీలున్నాయి.

ఇక పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఈ లెక్కలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ వందకుపైగా నోటిఫికేషన్లు ఇచ్చింది. దాని ద్వారా 35వేల 724 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది టీఎస్పీఎస్సీ పోర్టల్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లలో మొత్తం లక్షా 91వేల 126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ప్రకటన ఎలా ఉంటుందో గానీ… తెలంగాణలో నిరుద్యోగానికి సంబంధించిన లెక్కలూ ఓ సారి చూద్దాం. కరోనాకి ముందు లెక్కల ప్రకారం చూస్తే… రాష్ట్రంలో 8లక్షల 40వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2.7శాతం ఉంది. దీన్ని ఇంకాస్త లోతుగా చూస్తే పల్లెల్లో 1.2శాతం, పట్టణాల్లో 6.1శాతం మేర నిరుద్యోగం ఉందన్నది లెక్క. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి చూసే జాతీయ సగటు రేటు కంటే ఇది 1శాతం తక్కువే.

2015 నిరుద్యోగ వార్షిక నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 54శాతం మంది కార్మికులుగా వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. సేవా రంగంలో 28శాతం మంది ఉన్నారు. చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లలో.. 2% పొట్టకూటి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లున్నారు. 3% మంది డ్రైవర్లుగా, 4శాతం మంది బీడీ కార్మికులుగా ఉన్నారు. 11శాతం మంది మాత్రం సొంతగా సేద్యం చేసుకుంటున్నారు. 23శాతం వలసకూలీలు, 31శాతం మంది రోజువారీ కూలీలు ఉన్నారు. 7శాతం మంది మాత్రం ఏ ఉపాధీ లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Mar 2022 01:33 PM (IST)

    శాఖల వారీగా ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే..

    Whatsapp Image 2022 03 09 At 1.22.08 Pm

    Whatsapp Image 2022 03 09 At 1.22.08 Pm

  • 09 Mar 2022 01:19 PM (IST)

    కేసీఆర్ ఉద్యోగ ప్రకటనను విశ్వసించలేం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

    అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనను విశ్వసించలేమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాల ప్రకటన కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు గద్దెదింపడం ఖాయమని జోస్యం చెప్పారు. నిరుద్యోగులారా ఓపిక పట్టండి… ఎవరికీ లొంగాల్సిన అవసరం లేదంటూ పిలుపునిచ్చారు.  కేసీఆర్ ఏ రోజైనా మాట నిలబెట్టుకున్నారా? కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు.

  • 09 Mar 2022 01:16 PM (IST)

    ఉద్యోగ ప్రకటనపై నారాయణ్ పేట్‌లో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

    నారాయణ్ పేట్: 91,142 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో మక్తల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచ కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.

  • 09 Mar 2022 01:13 PM (IST)

    సీఎం ఉద్యోగ ప్రకటన మభ్య పెట్టడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

    ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువకులను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ప్రథమ డిమాండ్ ఉద్యోగాలుగా పేర్కొన్నారు.ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన మాట తప్పిన సీతక్క.. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారని అన్నారు. సీఎం ప్రకటన మభ్య పెట్టేటట్లు కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ మాటలు పక్కన పెట్టి, ఉద్యోగ నియామకాలకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • 09 Mar 2022 01:09 PM (IST)

    సూర్యాపేటలో కేసీఆర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల పాలాభిషేకం

    సూర్యాపేట : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని హర్షిస్తూ సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి వైద్య ఆరోగ్య శాఖా కాంట్రాక్ట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.  స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చి తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.

  • 09 Mar 2022 01:01 PM (IST)

    వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రారంభించాలి.. నిజామాబాద్ నిరుద్యోగుల వినతి

    అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ గ్రంథాలయంలో నిత్యం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్న యువత ఈ ప్రకటన పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే రిక్రూట్ మెంట్ ప్రారంభించాలని టీవీ9తో మాట్లాడిన నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • 09 Mar 2022 12:49 PM (IST)

    సీఎం కేసీఆర్‌కు టీడీపీ నేత జేసీ ప్రశంసలు

    సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబ్‌ మేళాను ప్రశంసించారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి 90వేల ఉద్యోగాల ప్రకటన గొప్పగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు పొలిటికల్‌ మైలేజ్‌ కూడా ఉంటుదని మెచ్చుకుంటూనే.. మా ఏపీలో అయితే జీతాలకే డబ్బులేదంటూ.. జగన్ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు.

  • 09 Mar 2022 12:32 PM (IST)

    అవసరమైతే సర్కారు కోచింగ్ సెంటర్లు..

    అసెంబ్లీ సాక్షిగా మెగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. నిరుద్యోగ యువతకు ఇదో మంచి అవకాశమన్నారు. విపక్షాల మాటలు నమ్మవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇంత పెద్దసంఖ్యలో మెగా జాబ్‌ మేళా మళ్లీ వచ్చే అవకాశమే లేదన్నారు. అవసరమైతే ప్రభుత్వం తరఫున కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే గువ్వల.

  • 09 Mar 2022 12:09 PM (IST)

    ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్: ఖమ్మం ఎంపీ నామా..

    సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన పైన టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. ' తెలంగాణ ఉద్యమం లో విద్యార్థులు, యువత పాత్ర కీలకమైంది. ముఖ్యమంత్రి ప్రకటనతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కల నెరవేరుతుంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కల కూడా సాకారమవుతుంది' అని నామా తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకాలు కొనసాగుతున్నాయి.

  • 09 Mar 2022 12:04 PM (IST)

    జర్నీలో ఉన్నా.. కేసీఆర్ ప్రసంగాన్ని మిస్ అవ్వలేదు..

    సీఎం కేసీఆర్‌ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో యువత, టీఆర్ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చి 'జై తెలంగాణ, జై కేసీఆర్‌' అంటూ నినాదాలు చేశారు. ఇక అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన  కీలక ప్రకటనను చూసేందుకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు.  కొంతమందైతే కారులో  యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరీ  కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు.

  • 09 Mar 2022 11:58 AM (IST)

    కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై టీపీఏ హర్షం..

    సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రకటన పట్ల తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం శుభపరిణామమని వారు కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ప్రకటనతో పాఠశాలల్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీతో విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నారు. అదేవిధంగా  రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

  • 09 Mar 2022 11:41 AM (IST)

    తెలంగాణలో 1.91 లక్షల ఖాళీలు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

    ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ' తెలంగాణలో  1,91000 ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదికలో తేలింది. ఇప్పుడేమో కేవలం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.  దీనికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. ఎన్నో వేలమంది విద్యార్థుల ఆత్మత్యాగాల వల్ల  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.  ఈనోటిఫికేషన్ తో వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు' అని జీవన్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు.

  • 09 Mar 2022 11:26 AM (IST)

    ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంపు..

    తెలంగాణలోని నిరుద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ వయోపరిమితి విషయంలోనూ కీలక నిర్ణయం  తీసుకున్నారు.  ఈమేరకు ఉద్యోగాల భర్తీలో జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లకు, SC/ST/BC అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు వయో పరిమితిగా నిర్ణయించారు.

  • 09 Mar 2022 11:23 AM (IST)

    ఉస్మానియాలో సంబరాలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

    అసెంబ్లీ లో 80వేలకు పైగా  ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన తో ఉస్మానియా యూనివర్సిటీ లో  టీఆర్ఎస్వీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటో కి పాలాభిషేకం చేశారు.ఇక  తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. 'నిరుద్యోగ బంధు కేసీఆర్' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

  • 09 Mar 2022 11:20 AM (IST)

    కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. టీవీ9తో ఏమన్నారంటే..

    తెలంగాణ చరిత్రలో మార్చి9 చారిత్రాత్మక రోజు అని ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె టీవీ9తో మాట్లాడారు. '80వేల కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ధన్యవాదాలు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించడం హర్షణీయం. బీజేపీ,కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దేశంలో2 కోట్ల ఉద్యోగల భర్తీ చేస్తామన్న బీజేపీ ఎందుకు మాట తప్పిందో సమాధానం చెప్పాలి. నిరుద్యోగులు విపక్షాల ట్రాప్ లో పడి కోర్టు లకు వెళ్లొద్దు. నిరుద్యోగ భృతి పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం' అని కవిత చెప్పుకొచ్చారు.

  • 09 Mar 2022 11:11 AM (IST)

    గరిష్ఠంగా పదేళ్ల వయోపరిమితి పెంపు..

    1. పోలీస్‌ శాఖ మినహా అన్ని శాఖల ఉద్యోగాలకు గరిష్ఠంగా పదేళ్ల వయోపరిమితి పెంపు
    2. ఈ ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వంపై రూ.7వేల కోట్ల భారం..
  • 09 Mar 2022 11:09 AM (IST)

    జిల్లాల వారీగా పోస్టులెన్నంటే..

    1. జోగులాంబ గద్వాల్‌- 662
    2. ములుగు- 696
    3. వికారాబాద్‌- 738
    4. నారాయణపేట్‌- 741
  • 09 Mar 2022 11:04 AM (IST)

    జిల్లాల వారీగా పోస్టులేన్నంటే..

    1. భూపాల పల్లి- 918
    2. నిర్మల్‌ - 876
    3. వరంగల్‌- 842
    4. అసిఫాబాద్‌- 825
    5. పెద్దపల్లి- 800
    6. జనగాం- 760
    7. సిరిసిల్ల - 601
    8. వనపర్తి-556
  • 09 Mar 2022 11:02 AM (IST)

    జిల్లాల వారీగా భర్తీ కానున్న పోస్టులెన్నంటే..

    1. నాగర్‌ కర్నూల్‌- 1257
    2. సంగారెడ్డి- 1243
    3. మహబూబ్‌నగర్‌- 1213
    4. అదిలాబాద్‌ - 1193
    5. సిద్ధిపేట- 1178
    6. మహబూబాబాద్‌ - 1172
    7. హన్మకొండ- 1157
    8. మెదక్‌- 1149
    9. జగిత్యాల- 1063
    10. మంచిర్యాల- 1025
    11. యాదాద్రి-1010
  • 09 Mar 2022 10:58 AM (IST)

    జిల్లాల వారీగా భర్తీ కానున్న పోస్టులేంటంటే..

    1. హైదరాబాద్‌- 5268
    2. నిజామాబాద్‌-1976
    3. మేడ్చల్‌- 1769
    4. రంగారెడ్డి- 1561
    5. కరీంనగర్‌- 1465
    6. నల్గొండ- 1398
    7. ఖమ్మం- 1340
    8. భద్రాద్రి- 1316
  • 09 Mar 2022 10:50 AM (IST)

    గ్రూప్స్ ఉద్యోగాలపై క్లారిటీ..

    1. గ్రూప్‌-1 కింద 503 పోస్టులు
    2. గ్రూప్‌-2 కింద 582
    3. గ్రూప్‌-3 లో 1, 373
    4. గ్రూప్‌-4లో 9, 168 ఉద్యోగాలు..
  • 09 Mar 2022 10:47 AM (IST)

    భర్తీ చేసే పోస్టులేంటంటే..

    సె

    1. రెవెన్యూ శాఖలో 3,560 పోస్టులు
    2. SC డెవలప్‌మెంట్‌లో 2,879 పోస్టులు
    3. ఇరిగేషన్‌ శాఖలో 2,962 ఉద్యోగాలు.
    4. ట్రైబల్‌ వెల్‌ఫేర్‌లో 2, 399 పోస్టులు
    5. మైనార్టీ వెల్‌ఫేర్‌లో 1,825
    6. అటవీశాఖలో 1, 598 పోస్టులు
  • 09 Mar 2022 10:40 AM (IST)

    80,039 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తాం..

    1. 80,039 ఉద్యోగాలను ఉన్న పళంగా భర్తీ చేస్తాం.
    2. విద్యాశాఖాలో 13, 086 పోస్టులు
    3. హోం శాఖలో 18,334 పోస్టులు
    4. వైద్యారోగ్యశాఖలో 12, 755 ఉద్యోగాలు
    5. ఉన్నత విద్యాశాఖలో 7వేలకు పైగా ఉద్యోగాలు..
  • 09 Mar 2022 10:34 AM (IST)

    91,142 పోస్టులను భర్తీచేస్తాం..

    1. కొత్తగా 91,142 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం
    2. ఈరోజు నుంచే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం..
    3. అలాగే 11వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం..
  • 09 Mar 2022 10:33 AM (IST)

    95 శాతం స్థానికులకే ఉద్యోగాలు..

    1. విద్యుత్‌ ఉద్యోగుల సమస్య సుప్రీం దాకా వెళ్లింది.
    2. రెండు రోజులు ఆలస్యమైనా పక్కాగా సమస్యను పరిష్కరిస్తాం.
    3. అటెండర్‌ నుంచి ఆర్టీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు
    4. మాది ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌.
  • 09 Mar 2022 10:27 AM (IST)

    1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం..

    1. ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం..
    2. ఇందులో 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం.
    3. మరో 22వేల ఉద్యోగాలు నియామాక ప్రక్రియలో ఉన్నాయి.
    4. 95 శాతం లోకల్ కోటా.. కేవలం 5 శాతమే ఓపెన్ కోటాలోనే ఉద్యోగాలను భర్తీ చేశాం.
    5. విద్యుత్ శాఖలో 22వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం.
  • 09 Mar 2022 10:23 AM (IST)

    కేంద్రం వివక్ష చూపుతోంది..

    1. కేంద్రంతో కొట్లాడి నీళ్ల వాటాను సాధించాం
    2. తెలంగాణ రూపాయి తెలంగాణకే ఖర్చు అవుతోంది.
    3. ఏపీ, తెలంగాణ సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదు.
  • 09 Mar 2022 10:21 AM (IST)

    ప్రతిపక్షాలు ప్రజలకు సమాధానం చెప్పాలి..

    1. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం
    2. ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడేవాళ్లు గతంలో ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
  • 09 Mar 2022 10:16 AM (IST)

    తెలంగాణ యాస మాట్లాడితేనే హీరోలుగా క్లిక్ అవుతున్నారు..

    1. ఒకప్పుడు తెలంగాణ భాష మాట్లాడితే జోకర్‌ లాగా చూసేవారు
    2. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే హీరోలుగా క్లిక్ అవుతున్నారు.
  • 09 Mar 2022 10:14 AM (IST)

    రాజకీయాలు మా పార్టీకి ఒక టాస్క్..

    1. వేరే పార్టీలకు రాజకీయాలకు ఒక గేమ్‌ కావచ్చు.
    2. కానీ మా టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజకీయాలంటేనే టాస్క్
  • 09 Mar 2022 10:11 AM (IST)

    రాష్ట్రం కోసం విద్యార్థులు ఉద్యమం చేశారు..

    1. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఉద్యమం చేశారు.
    2. ఉద్యోగాలు రాలేదన్న బాధతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
  • 09 Mar 2022 10:08 AM (IST)

    రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

    రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.   తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే కీలక ఘట్టమని ఈ సందర్భంగా కేసీఆర్ అభివర్ణించారు.

  • 09 Mar 2022 09:57 AM (IST)

    జాబ్‌ క్యాలెండర్‌నా? నిరుద్యోగ భృతినా?..

    తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్‌ ఎలాంటి వరాలు ప్రకటించనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నారా? లేదా నిరుద్యోగ భృతి ప్రకటించనున్నారా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే జాబ్‌ క్యాలెండర్‌ వైపే సర్కారు మొగ్గుచూపే అవకాశాలున్నాయని, సుమారు లక్ష ఉద్యోగాల భర్తీపై కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.

  • 09 Mar 2022 09:44 AM (IST)

    అరగంట ముందుగానే అసెంబ్లీకి కేసీఆర్..

    తెలంగాణ నిరుద్యోగులకు వరాలిస్తామని నిన్న వనపర్తి సభలో కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీకి అరగంట ముందుగానే చేరుకున్నారు. కాగా నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు.. ఇతర రైతుల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది.

Published On - Mar 09,2022 9:37 AM

Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..