Telangana: గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇన్యూరెన్స్, పెన్షన్‌పై కీలక అప్డేట్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లులను ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో గిగ్ వర్కర్లకు ప్రత్యేక యూనిక్ ఐడీ, పెన్షన్ వంటి సౌకర్యాలు అందనున్నాయి. వీటి వివరాలు..

జుమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వీరి కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టానికి సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ వర్కర్‌కు యూనిక్ ఐడీతో పాటు ఇన్యూరెన్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గిగ్ వర్కర్లకు అన్నీ ప్రయోజనాలు
గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు 2026ను కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో గిగ్ వర్కర్లకు చట్టబద్దత లభించనుంది. గిగ్ వర్కర్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కంపెనీలు అందించాలి. ప్రతీ మూడు నెలకు ఒకసారి ఎలక్ట్రానిక్ రిటర్న్స్‌ను ప్రభుత్వానికి సంస్థలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ గిగ్ వర్కర్‌కు ఒక ప్రత్యేక యూనిక్ ఐడీ అందిస్తారు. ఇక వారికి ఇన్యూరెన్స్, పెన్షన్, మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. గిగ్ వర్కర్ల ఫండ్‌ను 1 లేదా 2 శాతం లెవీతో ప్రారంభించనున్నారు.
గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు
ఇక గిగ్ వర్కర్లకు జీతాలు, కోతల వివరాల గురించి సంస్థలను ఆదేశించడం, యాప్ అల్గోరిథమ్‌లో వివక్ష లేకుండా చూడటం వంటి అంశాలు బిల్లులో ఉన్నాయి. ప్రతీ ట్రన్సాక్షన్‌పై ఫీజు వసూలు చేసి వెల్పేర్ బోర్డు నిర్వహణ ఖర్చుల కోసం గరిష్టంగా 5 శాతం వినియోగించాలని నిర్ణయించారు. 20 మంది సభ్యులతో గిగ్ వర్కర్ల వెల్‌ఫేర్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ ఉంటారు. ప్రతీ సంవత్సరం ఈ వెల్పేర్ బోర్డు సమావేశాలు నిర్వహిస్తారు. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక యూనిక్ ఐడీ వస్తుంది. అన్నీ కంపెనీలకు ఒకే ఐడీ ఉంటుంది. గిగ్ వర్కర్ల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులు, ఫ్లాట్ ఫామ్ స్థాయి కమిటీలు ఉంటాయి. గిగ్ వర్కర్లు తమ సమస్యలను కమిటీకి ఎప్పటికప్పుడు చెప్పుకోవచ్చు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, గౌరవం కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడనుంది.
