AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Yoga: గురు, శుక్రుల అనుకూలత.. త్వరలో ఆ రాశులకు వివాహ యోగం..!

Marriage Astrology: జ్యోతిషశాస్త్రంలో సప్తమ స్థాన అధిపతి, శుక్రుడు, గురు గ్రహాల సంచారాన్ని బట్టి ప్రేమలు, పెళ్లిళ్లు తదితర విషయాలను నిర్ణయించడం జరుగుతుంది. సప్తమాధిపతి, గురు, శుక్రులు అనుకూలంగా ఉన్న పక్షంలో కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి. ఏప్రిల్ 18 నుంచి మే 16వ తేదీ వరకు కొనసాగే వైశాఖ మాసం పెళ్లిళ్ల సీజన్ అయినందువల్ల, సప్తమాధిపతి, గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ప్రేమలు, పెళ్లిళ్లపరంగా యోగదాయక జీవితం ఏర్పడుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 5:56 PM

Share
వృషభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు, శుభ గ్రహాలైన గురు, శుక్రులు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఈ వైశాఖ మాసంలో తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ రాశికి చెందినవారు ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ప్రేమ, వైవాహిక జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన గురువు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు లాభ స్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తి లేదా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కుదరడం గానీ జరుగుతుంది.  తక్కువ ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది.

2 / 6
సింహం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయత్నాలు ఎక్కు వగా చేయాల్సి ఉంటుంది. బాగా దూర ప్రాంతపు వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. శుక్ర, గురువుల సంచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమలో పడడానికి, ప్రేమ వివాహానికి కూడా అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల మీదా, పెళ్లి మీదా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

3 / 6
తుల: ఈ రాశివారికి సప్తమాధిపతి అయిన కుజుడు వైశాఖ మాసంలో తన సొంత రాశి అయిన మేష రాశిలో సంచారం చేయడం, గురువు భాగ్య స్థానంలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి అతి తక్కువ ప్రయత్నంతో అత్యంత సంపన్నుడైన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. దూరపు బంధువుల్లో గానీ, బాగా పరిచయం ఉన్న వ్యక్తితో గానీ పెళ్లి కుదరవచ్చు. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి సప్తమాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం కుజుడితో కలిసి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. ప్రేమ జీవితం వైశాఖ మాసంలో పెళ్లి దారికి తీస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా వ్యాపారులు లేదా ఆర్థిక సంస్థల ఉద్యోగులతో పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది. ప్రేమ లేదా పెళ్లి జీవితం తప్పకుండా విజయవంతమవుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన రవి తృతీయ, చతుర్థ స్థానాల్లో శుక్రుడితో సంచారం చేయడం, ఈ రాశిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజకీయాలు, రియల్ ఎస్టేట్, ప్రభుత్వం వంటి రంగాల్లో పనిచేసే వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా ఎక్కువగా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వైశాఖ మాసంలో పెళ్లయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

6 / 6
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ