AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి చెన్నై అలా..?

Rajasthan Royals vs Chennai Super Kings: చెన్నై టీం ఐదుసార్లు ఛాంపియన్‌ (2010, 2011, 2018, 2021, 2023)గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ గత సీజన్‌లో చెన్నై జట్టు ఘోరంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ టీం 2008లో టైటిల్ గెలిచినప్పటి నుంచి మళ్లీ ఒక్క టైటిల్ గెలవలేదు. గత సీజన్‌లో 9వ స్థానంలో నిలిచింది.

RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి చెన్నై అలా..?
Rr Vs Csk Toss
Venkata Chari
|

Updated on: Mar 30, 2026 | 7:15 PM

Share

Rajasthan Royals vs Chennai Super Kings, 3rd Match, Indian Premier League 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, డెవాల్డ్ బ్రెవిస్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యారు. బ్రెవిస్ మూడు మ్యాచ్‌లకు దూరమవ్వగా, ధోని రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉంటాడు.

చెన్నై టీం ఐదుసార్లు ఛాంపియన్‌ (2010, 2011, 2018, 2021, 2023)గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ గత సీజన్‌లో చెన్నై జట్టు ఘోరంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ టీం 2008లో టైటిల్ గెలిచినప్పటి నుంచి మళ్లీ ఒక్క టైటిల్ గెలవలేదు. గత సీజన్‌లో 9వ స్థానంలో నిలిచింది.

జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(కీపర్), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

Follow Us