AP, Telangana: దేశంలోనే అత్యధిక అప్పులున్నది మన తెలుగు రాష్ట్రాలే..!
AP, Telangana: ఇక సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, ఓబీసీలలో 16.6 శాతం మంది అప్పుల ఊబిలో కూరుకుపోగా, గిరిజనుల్లో ఈ భారం 11 శాతంతో తక్కువగా ఉంది. కుటుంబంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నవారిపై అప్పుల భారం ఎక్కువగా ఉందని, సభ్యులు..

AP, Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోనే అత్యధికంగా అప్పుల భారంతో సతమతమవుతున్నారు. ఏపీ, తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) విడుదల చేసిన తాజా సర్వేలో తేలింది. 2020-21 లెక్కల ప్రకారం.. ఏపీలో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పులపై ఆధారపడినట్లు నివేదిక వెల్లడించింది. అయితే తొలి రెండు స్థానాల్లో వరుసగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. అలాగే కర్ణాటకలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) (95.9%) కాగా, ఆ తర్వాత 92.3% మందితో ఏపీ రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో 23.2% మందిపైనే అప్పుల భారం ఉండగా, తెలంగాణలో 86.5% మందే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా, 31.8% మంది అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈశాన్యరాష్ట్రాల ప్రజల్లో 80.2% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా, 7.4% మందికే అప్పులున్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం హిందువులు 88.1%, ముస్లింలు 80.8శాతం నమోదైంది. అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా, చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి.
ఇక సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, ఓబీసీలలో 16.6 శాతం మంది అప్పుల ఊబిలో కూరుకుపోగా, గిరిజనుల్లో ఈ భారం 11 శాతంతో తక్కువగా ఉంది. కుటుంబంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నవారిపై అప్పుల భారం ఎక్కువగా ఉందని, సభ్యులు ఎక్కువగా ఉన్న కుటుంబాలపై భారం తక్కువగా ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: Top Electric Scooters: లక్ష రూపాయల లోపు 5 అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్.. బెస్ట్ మైలేజీ!




