Mukesh Ambani: సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
Mukesh Ambani: ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్ అంబానీ. ఈ పేరు తెలియనివాంటూ ఉండరు. ఎందుకంటే దేశంలోనే అత్యంత సంపన్నుడు. ప్రపంచ ధనికుల జాబితాలో ఉన్నారు. అంబానీ గురించి ఏ విషయం అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. దేశంలో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ సంపాదనలో అగ్రస్థానంలో ఉంటారు. అంబానీ కుటుంబ వ్యాపారం మొత్తం విలువ రూ.28.2 లక్షల కోట్లు అని హురున్ ఇండియా అనే సంస్థ విడుదల చేసిన నివేదిక చెప్పింది. అయితే అంబానీ కుటుంబం ఎంతో విలువలతో కూడినది. అంబానీ తమ పిల్లలకూ అవే విలువలు నేర్పించారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు అవసరమైతే కఠినంగానూ వ్యవహరించే తత్వం అంబానీది.
ఇది కూడా చదవండి: Top Electric Scooters: లక్ష రూపాయల లోపు 5 అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్.. బెస్ట్ మైలేజీ!
వారికి విద్య, నీతి, జీవిత సూత్రాలను అందించడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేశారు. కఠినంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ముఖేష్, నీతా అంబానీ ఇద్దరూ తమ పిల్లలు తప్పు చేసినప్పుడల్లా కఠినంగా ఉండేవారు. ఎదుటి వారికి మార్యద ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తుంది అంబానీ కుటుంబం. ఇలాగే ఓ సందర్భంలో తమ కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్‌మెన్‌కి క్షమాపణ చెప్పించారని మీకు తెలుసా?
వారి పిల్లలలో విలువలను పెంపొందించారు:
ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్ – నీతా ఈ విలువలను వారిలో నాటడానికి సాధారణ తల్లిదండ్రుల మాదిరిగానే వారిని పెంచారు. అంబానీ కుటుంబం ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. వారు తమ పిల్లలు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీలో సైతం ఈ విలువలను నేర్పించారు. సొంత పిల్లలు అయినా మర్యాద విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు అంబానీ.
వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పిన ఆకాశ్ అంబానీ.. కారణం ఏంటంటే
ముఖేష్ అంబానీ ఒకసారి తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్‌మెన్‌కి క్షమాపణ చెప్పించిన సంఘటన జరిగింది. దానికి కారణం లేకపోతేదు. సిమి గరేవాల్ షోలో పేరెంటింగ్ విధానాల గురించి చర్చ సందర్భంగా నీతా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓసారి ఆకాశ్ భవనంలోని వాచ్‌మెన్‌తో ఫోన్‌లో చాలా దురుసుగా మాట్లాడడని, దీన్ని గమనించిన ముఖేష్ అంబానీ వెంటనే ఆశాశ్‌ను మందలించాడని నీతా అంబానీ వెల్లడించారు. అంతేకాదు ఆకాశ్‌ను కిందకు తీసుకువెళ్లి ఆ వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించారని నీతా అంబానీ వెల్లడించారు. దీన్ని బట్టి తెలుస్తుంది అంబానీ కుటుంబ ఎంత మర్యాదగా వ్యవహరిస్తుందో. ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా వారితో మర్యాదగా ప్రవర్తించాలని అంబానీ చెబుతుంటారని, ప్రతి ఒక్కరిని గౌరవించాలని బోధిస్తుంటారని చెప్పుకొచ్చారు నీతా అంబానీ. అంబానీ కుటుంబంలో భాగమైనంత మాత్రాన తన పిల్లలను ఎప్పుడు హద్దు దాటనీయలేదని నీతా వెల్లడించారు.
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1812 రీఛార్జ్‌తో 365 రోజులు.. అన్ని బెనిఫిట్స్!
ఇది కూడా చదవండి: SUV Scooter: భారతదేశపు మొట్టమొదటి SUV స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








