Telangana: వామ్మో.. ఇదెక్కడి వైద్యం..! కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించేశారు.. చివరకు..

వైద్యో నారాయణ హరి అంటారు.. అంటే.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.. కానీ.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా చేస్తున్నారు.. తాజాగా.. ఓ వైద్యుడు చేసిన పనికి అంతా షాకవుతున్నారు.

Telangana: వామ్మో.. ఇదెక్కడి వైద్యం..! కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించేశారు.. చివరకు..
Crime News
Follow us

|

Updated on: May 06, 2023 | 8:58 AM

వైద్యో నారాయణ హరి అంటారు.. అంటే.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.. కానీ.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా చేస్తున్నారు.. తాజాగా.. ఓ వైద్యుడు చేసిన పనికి అంతా షాకవుతున్నారు. తల పగిలి ఆసుపత్రికి వస్తే.. ఫెవిక్విక్ తో అతికించేసి పంపించాడు. ఈ షాకింగ్ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో చోటుచేసుకుంది. కింద పడి గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించి ఏం కాదంటూ పంపించేశారని బాలుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.

బాధిత బాలుడి తండ్రి వంశీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. బంధువుల ఇంట్లో పెళ్లి నిమిత్తం అయిజకు వచ్చారు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్‌ చౌదరి (7) గురువారం రాత్రి పెళ్లి వేడుకలో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఎడమ కంటి పైభాగంలో గాయం కావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, లోతుగా గాయం అయినప్పటికీ.. వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా అక్కడున్న ఫెవిక్విక్‌తో అతికించేసి పంపించారు. గమనించిన తండ్రి వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను ప్రశ్నించగా.. సిబ్బంది పొరపాటుగా చేశారని పేర్కొన్నారని వంశీకృష్ణ తెలిపారు. బాలుడికి ఏమీ కాదని, ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని చెప్పారన్నారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రి నిర్లక్ష్యంపై బాధిత బాలుడి తండ్రి అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై నరేశ్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..