Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఒకేసారి 60 మందిని ట్రాన్స్‌ఫర్ చేసే ఛాన్స్..!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 60 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఒకేసారి 60 మందిని ట్రాన్స్‌ఫర్ చేసే ఛాన్స్..!
Telangana Police
Follow us

|

Updated on: Jan 25, 2023 | 8:05 PM

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేయాలని డిసైండ్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 60 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇదే అంశంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీతో చర్చలు జరిపారు. మరికాసేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, కరీంనగర్, రామగుండం సీపీని బదిలీ చేసింది సర్కార్. అలాగే, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ, వనపర్తి ఎస్పీలు బదిలీ అయ్యారు. ఇక రామగుండం సీపీగా సుబ్బారాయుడిని నిమించింది ప్రభుత్వం. మల్కాజిగిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమించింది. ఖమ్మం సీపీగా సురేష్‌, జగిత్యాల ఎస్పీగా భాస్కర్‌, విమెన్‌ సెఫ్టీ ఎస్పీగా పద్మజ నియమించినట్లు తెలుస్తుంది.

Latest Articles