AP-Telangana: చిన్న మాటకే చనిపోతున్నారు.. నిన్న పల్నాడు జిల్లాలో.. నేడు హైదరాబాద్‌లో

చిన్న, చిన్న కారణాలకే టీనేజర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చిన్న మాట అన్నా భరించలేకపోతున్నారు. బంగారం లాంటి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

AP-Telangana: చిన్న మాటకే చనిపోతున్నారు.. నిన్న పల్నాడు జిల్లాలో.. నేడు హైదరాబాద్‌లో
Teen Suicide(representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 13, 2022 | 10:10 AM

వద్దురా నాయనా అని పేరెంట్స్ వారిస్తే చాలూ.. ఈ తరం టీనేజర్లు హర్టయిపోతున్నారు. కొంపలేవో మునిగిపోయాయన్నట్టుగా ఫీలవుతున్నారు. ఈ జన్మనాకొద్దంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పలపాడులో 16ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. కారణం.. మందలింపు. మంచినీళ్ల కోసం  ఇంటికి ఆలస్యంగా వచ్చాడని పేరెంట్స్ మందలించారు. దీంతో ఇంట్లోంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడతను. కంగారుపడ్డ తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరకు బావిలో శవమై కనిపించాడు. బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నవాళ్ల గుండె చెరువైంది.

ఇవాళ హైదరాబాద్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. మేడ్చల్‌కు చెందిన ప్రభంజన్‌ బీటెక్ స్టూడెంట్‌. డెయిలీ లేట్‌గా పడుకుంటూ.. లేట్‌గా నిద్రలేస్తున్నాడట. ఈ పద్దతి మార్చుకోవాలని తల్లిదండ్రులు చివాట్లు పెట్టడంతో కోపంగా బైక్‌ తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే మొబైల్‌ స్విచాఫ్‌ వచ్చింది. కోపం తగ్గాక వస్తాడులే అని భావించారు కుటుంబసభ్యులు. అయితే ఉన్నట్టుడి దుండిగల్ పోలీసుల నుంచి కాల్ వచ్చింది. బైక్ నెంబర్‌ చెప్పడంతో పరుగు పరుగున పీఎస్‌కి వెళ్లారు. పోలీసులు చెప్పిన మ్యాటర్‌ విని కుప్పకూలిపోయారు. ఇంట్లోంచి అలిగి వెళ్లిపోయిన ప్రభంజన్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన విషయాన్ని కంప్లయింట్‌లో వివరించి కన్నతల్లి కన్నీరుమున్నీరైంది.

ఈ మధ్య కాలంలో యువత, పిల్లల ధోరణి ఆందోళన కలిగిస్తోంది. వాళ్ల మెంటాలిటీ మరీ బలహీనంగా తయారైంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, టీచర్ మందలించిందనో, మార్కులు తక్కువ వచ్చాయనో… ఇలా చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. పిల్లలు ఎందుకిలా మారుతున్నారన్నది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..