Telangana: వేగంగా వెళ్తున్న సెవెన్ సీటర్ కారును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా.
మూవీస్ ప్రభావం సాధారణ ప్రజలపై ఎంత మేరకు ఉంటుందో లేదో తెలియదు కానీ.. దుంగల దొంగలపై మాత్రం వందకు వంద శాతం ఉంటుంది. చలనచిత్రాలు చూసి దొంగలు మరింత చాకచక్యంగా ఎలా చోరీ చేయాలో నేర్చుకుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో లక్షలాది రూపాయల విలువచేసే టేకు కలప అక్రమ రవాణాను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.. పుష్ప సినిమాను మరిపించేలా కారులో కలప స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాళ్లు అడ్డంగా బుక్కయ్యారు.. వారి వద్ద భారీ ఎత్తున విలువైన టేకు కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..ట్రాలీ వాహనాలలో కలప స్మగ్లింగ్ చేస్తే పట్టుబడుతున్నామని ఏకంగా సెవెన్ సీటర్ కారును రీ డిజైన్ చేసుకున్నారు కేటుగాళ్లు.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నరికిన టేకు కలపను గుట్టు చప్పుడు కాకుండా పట్టణాలకు తరలిస్తున్నారు.
సెవెన్ సీటర్ కారులో ఛత్తీస్‌గఢ్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా కొందరు స్పగ్లర్లు ఈ కలపను పట్టణాలకు తరలిస్తున్నారు.. ఏకంగా కారును కలప స్మగ్లింగ్ కోసం డిజైన్ చేసుకున్నారు.. సెవెన్ సీటర్ కారులో కలప స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం తెలుసుకున్న వెంకటాపురం అటవీశాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి కాపు కాశారు.
బుధవారం అర్ధరాత్రి కారులో చర్ల, వెంకటాపురం మీదుగా వరంగల్‌కు తరలించేందుకు వెళ్తున్న ఆ వాహనాన్ని వెంకటాపురం మండలం ఆలుబాక వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.. కారులో భారీ ఎత్తున టేకు కలప లభ్యమయింది.
ఆ కారును వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించిన అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. గతంలో కూడా ఇదే విధంగా ఛత్తీస్‌గఢ్ నుండి విలువైన టేకు కలపను గుట్టుచప్పుడు కాకుండా పట్టణ ప్రాంతాలకు తరలించినట్లుగా సమాచారం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి