Telangana: ఆ నియోజకవర్గ టికెట్‌పై ఇంకా కొనసాగుతోన్న సస్పెన్స్‌.. ఇంతకీ కేసీఆర్‌ మనసులో ఏముంది.?

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్ల టికెట్లను కన్ఫమ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క నర్సపూర్ సీట్ ను మాత్రం హోల్డ్ లో పెట్టారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మధ్య పోటీ బాగా ఉంది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మదన్‌ రెడ్డి, మూడోసారి...

Telangana: ఆ నియోజకవర్గ టికెట్‌పై ఇంకా కొనసాగుతోన్న సస్పెన్స్‌.. ఇంతకీ కేసీఆర్‌ మనసులో ఏముంది.?
KCR
Follow us
P Shivteja

| Edited By: Narender Vaitla

Updated on: Sep 23, 2023 | 10:22 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో మెదక్‌ జిల్లాలోని అందరు సిట్టింగ్‌లకు మళ్ళీ టికెట్లు కాన్ఫామ్‌ చేశారు. కానీ ఆ ఒక్క నియోజకవర్గం మాత్రం పెడింగ్‌లో పెట్టారు. అదే నర్సాపూర్ నియోజకవర్గం. ప్రస్తుతం ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ నేతలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం ఉండడం లేదు. ఇప్పటి వరకు నర్సాపూర్ నియోజకవర్గ టికెట్‌పై పార్టీ అధిష్టానం మాత్రం స్పందించడం లేదు. నర్సాపూర్ టికెట్ పంచాయితీ ఇంకా పెడింగ్ లోనే ఉంది. దీంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ఆ ఇద్దరు నేతలు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. వీరిలో ఒకరు ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. ఇంకొకరు మహిళ కమిషన్ ఛైర్మెన్ సునీత లక్ష్మరెడ్డి.

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్ల టికెట్లను కన్ఫమ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క నర్సపూర్ సీట్ ను మాత్రం హోల్డ్ లో పెట్టారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మధ్య పోటీ బాగా ఉంది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మదన్‌ రెడ్డి, మూడోసారి కూడా తనకే టికెట్ కావాలని ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సునీత కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.

ఇక ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి కూడా అస్సలు తగ్గడం లేదని, ఆయన అనుచరులు అయితే ఒక అడుగు ముందుకు వేసి.. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డి సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు అని కచ్చితంగా నర్సాపూర్ టీకేట్ అతనికే వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు..మరో వైపు గతంలో కాంగ్రెస్స్ లో ఉన్న సునీత కూడా గతంలో ఇక్కడి నుండి కాంగ్రెస్స్ పార్టీ తరుపున పోటీచేసి గెలిచి కాంగ్రెస్స్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారని.. అయితే 2018లో టిఆర్ఎస్ లో చేరినప్పుడు కూడా తమ నాయకురాలు సునీత లక్ష్మరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తాం అని బీఆర్ఎస్ అధిష్టానం చెప్పిందని, అందుకే సునీత బీఆర్‌ఎస్‌లో చేరారని ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు.

ఎమ్మెల్యే మదన్ రెడ్డి టికెట్ కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయం పై ఇప్పటి వరకు ఎక్కడ స్పందించలేదట… ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాత్రం టికెట్ తనకే వస్తుంది అని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రకటనలు చేస్తున్నారట.. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కంటే ఎక్కువ అయనతో ఉండే కొంతమంది నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది. ఒక ఓవైపు సునీత లక్ష్మరెడ్డి సైలెంట్‌గా ఉంటే, ఎమ్మెల్యే వర్గం మాత్రం ప్రెస్‌ మీట్‌లు ఏర్పాటు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

ఇదే విషయంపై నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు సైతం ఇటీవలే మంత్రి హరీష్ రావును కలిసి టికెట్ గురించి మాట్లాడితే కూడా తన చేతిలో ఏం లేదని.. అంత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలోనే ఉందని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇక నియోజకవర్గంలోని కొంతమంది నేతల తీరు వల్లే పార్టీ అధిష్టానం టికెట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల ఓవర్ యాక్షన్ వల్ల మా నేతకు ఇబ్బందులు తప్పేలా లేవు అని మదన్ రెడ్డి డై హార్డ్ ఫ్యాన్స్ గుసగుసలు పెట్టుకుంటు న్నారట. ఈ సమయంలో ఓపికగా ఉండాలి అని తొందరపాటుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు అని అంటున్నారట నర్సాపూర్ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..