AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీలయ్యేదెవరు..? గులాబీ దళపతి కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

తెలంగాణలో గ‌వ‌ర్నర్ కోటా ఎమ్మెల్సీల‌ పదవులు భర్తీ అయ్యేనా..? పదవుల గడువు ముగిసినా తిరిగి కేటాయింపుపై గులాబీబాస్ మౌనం వెనుక మర్మం ఏంటి..? ఉన్న 2 ఎమ్మెల్సీలకు పదులసంఖ్యలోఆశావహులు ఉండగా.. మధ్యలో గవర్నర్ ఆమోదం పై సందేహాలు నెలకొన్నాయి.

Telangana: గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీలయ్యేదెవరు..? గులాబీ దళపతి కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ
Cm Kcr
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2023 | 7:21 AM

Share

తెలంగాణలో గ‌వ‌ర్నర్ కోటా ఎమ్మెల్సీల‌ పదవులు భర్తీ అయ్యేనా..? పదవుల గడువు ముగిసినా తిరిగి కేటాయింపుపై గులాబీబాస్ మౌనం వెనుక మర్మం ఏంటి..? ఉన్న 2 ఎమ్మెల్సీలకు పదులసంఖ్యలోఆశావహులు ఉండగా.. మధ్యలో గవర్నర్ ఆమోదం పై సందేహాలు నెలకొన్నాయి. సో.. ఇన్ని చిక్కుముళ్ల మధ్య పదవుల భర్తీ సస్పెన్స్‌గా మారింది. గ‌వ‌ర్నర్ కోటా MLC స్థానాల భ‌ర్తీలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇద్దరు MLCలు రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల ప‌ద‌వీకాలం శ‌నివారంతో ముగిసింది. ఈ రెండు స్థానాలు ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్నది పార్టీనేత‌ల్లో జోరుగా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పార్టీ అధినేత కేసీఆర్‌ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా కౌషిక్‌రెడ్డి పేరు ప్రతిపాదించినా..గవర్నర్‌ ఆ పేరును తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి గవర్నర్‌ మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మధుసూదనాచారి, గోరటి వెంకన్న లాంటి పేర్లను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా నేతల పేర్లను ఖరారు చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

MLCలు రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌లకు గులాబీపార్టీ రెండోసారి అవకాశం కల్పించింది. ఈ ఇద్దరి స్థానాల్లో కొత్తనేతలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. ఐతే రెండు పదవుల్లో ఒక మైనార్టీ, మరొకటి బీసీ నేతలకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ స్థానాలకోసం పార్టీనేతలు పెద్దయెత్తున ఆశలు పెట్టుకున్నారు. క్రిస్టియన్‌ మైనార్టీల పేర్లను పరిగణలోకి తీసుకుంటే విద్యాస్రవంతి, రాయ్‌డిన్‌రోచ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మాజీ TSPSC ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

గులాబీ దళపతి కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

MLC అభ్యర్థులపై గులాబీ దళపతి కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన క్యాబినెట్ మీటింగ్‌లో గ‌వ‌ర్నర్ కోటా MLC అభ్యర్థుల‌పై స్పష్టత రాక‌పోవ‌డంతో ఆశావ‌హుల్లో మ‌రింత టెన్షన్‌ పెరిగింది. మరోవైపు కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్, దానికి తోడు బిల్లుల ఆమోదంలో గవర్నర్ వ్యవహరించిన తీరు చూస్తే..ఇప్పట్లో ఆ ఫైల్‌ పంపిస్తే ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో అనే ఆలోచనలో BRS అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..