AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఒంటిపై దుస్తులు లేని స్థితిలో రాజేష్‌  డెడ్‌బాడీ.. కాల్ డేటా చెక్ చేయగా..

ఉదయం 8గంటల సమయంలో స్థానికులు కుళ్లిపోయిన స్దితిలో మృతదేహం కనిపించడంతో హయత్​నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Hyderabad: ఒంటిపై దుస్తులు లేని స్థితిలో రాజేష్‌  డెడ్‌బాడీ.. కాల్ డేటా చెక్ చేయగా..
Hayatnagar Rajesh Murder
Ram Naramaneni
|

Updated on: May 29, 2023 | 8:32 PM

Share

హయత్‌నగర్‌లో రాజేష్‌ అనే యువకుడి  హత్యకు గురయ్యాడు. కుంట్లూరులోని  నిర్మానుష్య ప్రాంతంలో  ఒంటిపై దుస్తులు లేని స్థితిలో రాజేష్‌  డెడ్‌బాడీని  గుర్తించిన పోలీసులు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టీ హత్యేనని ప్రాథమికంగ నిర్ధారణ. రాజేష్‌ను  చంపింది ఎవరు? ఎందుకు? అన్నది ఇప్పుడు సస్పెన్స్.  రాజేష్‌ ములుగు జిల్లా వాసి. రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. హన్మకొండలోని తాతయ్య  ఇంట్లో వుండే  రాజేష్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ఉంటోన్న తన బాల్యస్నేహితుడు సాయిప్రకాష్‌ దగ్గరకు వచ్చాడు. ఇంతలోనే ఈ  దారుణం జరిగింది.

రాజేష్‌కు  ఎవరితో శత్రుత్వం లేదని.. స్నేహితులు కూడా అంతగా లేరంటున్నారు  అతని కుటుంబసభ్యులు. బంధువులు. ఈనెల 20న రాజేష్‌  హన్మకొండ నుండి దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటోన్న తన ఫ్రెండ్‌  సాయిప్రకాష్‌కు రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు ఇద్దరు సరదగా గడిపాడు. 23న  రాజేష్‌ ఇబ్రహీం పట్నం వెళ్లాడంటున్నాడు సాయిప్రకాష్‌. డబ్బులు కావాలంటే  ట్రాన్స్‌ఫర్‌ చేశానన్నాడు.  ఇబ్రహీంపట్నం వెళ్తానన్నా  రాజేష్‌ హయత్‌నగర్‌లో శవమయ్యాడు.  స్థానికుల సమాచారంతో   రాజేష్‌ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మరి హత్యకు  దారితీసిన కారణాలేంటి? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు సాగుతుంది.

రాజేష్‌ది హత్యేనని  నిర్దారించారు పోలీసులు.  హత్యకు కారణాలేంటి? నిందితులెవరు? తెలిసినవాళ్లే   పక్కా పథకంతో  అతన్ని కడతేర్చారా?  ప్రేమ  వ్యహారమే కారణమా? లేదంటే మరేదైనా కోణం ఉందా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజేశ్​ కాల్‌ డేటాను ద్వారా ఏలూరుకి చెందిన ఒక మహిళతో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. మహిళకు పోలీసులు ఫోన్ చేయగా.. తనకు రాజేశ్ తెలియదంటూ ఆన్సర్ ఇచ్చినట్లు తెలిసింది. కేసును దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం