BJPLP leader: బీజేపీఎల్పీ నేతపై కొనసాగుతున్న సస్పెన్స్.. స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎటు వైపు..?
అసెంబ్లీ సమావేశాల వేళ.. సభలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ నాయకత్వం వహిస్తుండగా, BRSLP నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఇప్పటి వరకూ BJLP నేత ఎంపికపై మాత్రం క్లారిటీ రాలేదు. BJLP నేత కోసం.. కమలంలో కసరత్తు కొనసాగుతునే ఉంది. బీజేపీ శాసన సభాపక్ష నేత పదవి కోసం... ప్రధానంగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.
కౌన్ బనేగా బీజేపీఎల్పీ నేత…!! ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్..! అసెంబ్లీ సమావేశాల వేళ.. సభలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ నాయకత్వం వహిస్తుండగా, BRSLP నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఇప్పటి వరకూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై మాత్రం క్లారిటీ రాలేదు. BJPLP నేత కోసం.. కమలంలో కసరత్తు కొనసాగుతునే ఉంది. బీజేపీ శాసన సభాపక్ష నేత పదవి కోసం… ప్రధానంగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.
గురువారం నుండి తిరిగి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కేవలం సాంప్రదాయ బద్దంగానే సమావేశాల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతుంది భారతీయ జనతా పార్టీ. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఉండటంతో ప్రమాణం స్వీకరణానికి సైతం దూరంగా ఉన్నారు బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు. కొత్త స్పీకర్ ఎన్నిక అవ్వగానే ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నారు. అటు బీజేపీ పక్ష నేత ఎన్నిక విషయం లోనూ బీజేపీ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఆరుగురు సభ్యులు కొత్త వారు కాగా, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాత్రమే గతంలో శాసనసభ్యులుగా అనుభవం ఉంది. పలు మార్లు గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి పక్ష నేతగా అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ఈ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలపై స్పందించడంలో వేచి చూసే ధోరణిలో ఉంటూనే, పలు సూచనలు సలహాలు చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుండి బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చిన తరువాతే పలు అంశాల పై చర్చించి తదుపరి సమావేశాల్లో పూర్తి స్థాయిలో గళం విప్పనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…