Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallareddy: శామీర్‌పేట్ తహశీల్దార్ సహా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Mallareddy: శామీర్‌పేట్ తహశీల్దార్ సహా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
Mallareddy
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2023 | 1:35 PM

తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేసిన మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్‌పేట్ తహశీల్దార్ పై సైతం కేసు నమోదు అయ్యినట్లు పోలీసులు పేర్కొన్నారు.

గతంలోనూ మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్‌లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…