AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: ఇందిరమ్మ ఇళ్లు, రైతుబంధుపై ప్రత్యేక కార్యాచరణ.. త్వరలోనే కీలక నిర్ణయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు హామీల అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. అలాగే రైతులకు ఉచిత కరెంట్ లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించింది.

Congress: ఇందిరమ్మ ఇళ్లు, రైతుబంధుపై ప్రత్యేక కార్యాచరణ.. త్వరలోనే కీలక నిర్ణయం
Indiramma Houses, Rythu Bandhu
Srikar T
|

Updated on: Dec 13, 2023 | 1:15 PM

Share

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు హామీల అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. అలాగే రైతులకు ఉచిత కరెంట్ లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఇక రేషన్, వ్యవసాయం, టీఎస్పీఎస్సీ ఇలా అన్ని అంశాలపై పట్టు సారిస్తోంది. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకంపై ఫోకస్ చేసింది. పేదలకు ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 3, 4 నమూనాలను సిద్దం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలోనే భాగంగా ఉంది గృహనిర్మాణ శాఖ. దీనిని పునరుద్దరించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అప్పటి కల్లా పూర్తి స్థాయి ఆచరణాత్మక నిర్ణయాలతో, సరికొత్త నిర్మాణానికి సంబంధించిన నమూనాలతో సిద్దంగా ఉండాలని అధికారులకు తెలిపారు. సీఎం సమీక్ష తరువాత నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

అలాగే ఆరు గ్యారెంటీలలో రైతులకు సంబంధించిన రైతు బంధు పంపిణీ మరో ముఖ్యమైన అంశంగా చెప్పాలి. మన్నటి వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా రైతు బంధు పంపిణీకి అంతరాయం కలిగిన విషయం మనకు తెలిసిందే. అయితే సోమవారం నుంచి రైతు బంధు పంపిణీ నిధులను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేస్తోంది. దీంతో 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640 కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలిపారు అధికారులు. అయితే రైతు బంధు లబ్ధిని పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ సరైన మార్గదర్శకాలు అమలు కానందున పాత పద్దతిలోనే జమ చేశారు. కొత్త విధానానికి సంబంధించిన సర్కులర్ వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో నగదు జమ చేస్తామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..