Telangana Assembly Speaker: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. గడ్డం ప్రసాద్ ఎన్నిక లాంఛనమే..
తెలంగాణ శాసనసభా స్పీకర్‌గా నామినేషన్ వేశారు గడ్డం ప్రసాద్‌కుమార్. ఈ ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌కు కావాల్సిన బలం ఉన్నందున స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక లాంఛనం కానుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉన్నందున స్పీకర్ పదవిని గడ్డం ప్రసాద్ సమర్ధవంతంగా నిర్వహిస్తారని భావిస్తోంది కాంగ్రెస్.
తెలంగాణ శాసనసభా స్పీకర్‌గా నామినేషన్ వేశారు గడ్డం ప్రసాద్‌కుమార్. ఈ ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌కు కావాల్సిన బలం ఉన్నందున స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక లాంఛనం కానుంది.
అధికార కాంగ్రెస్ పార్టీకి 64మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది, సాధారణ మెజారిటీ కావడంతో సభా నిర్వహణ అత్యంత కీలకం కాబోతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉన్నందున స్పీకర్ పదవిని గడ్డం ప్రసాద్ సమర్ధవంతంగా నిర్వహిస్తారని భావిస్తోంది కాంగ్రెస్.
గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యాక స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, ఎల్లుండి ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. డిసెంబర్ 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంది తెలంగాణ శాసనసభ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…