TSRTC: ఉచిత బస్సు సర్వీస్.. తెలంగాణలో ఒక్క రోజే ఏకంగా అరకోటి మంది ప్రయాణం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఒకటి. ఈ హామీని అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఎండీతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోనియా గాంధీ పుట్టిన రోజు అయిన డిశంబర్ 9 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఉచిత ఆర్టీసీ బస్సులను 60 శాతం మంది మహిళలు వినియోగించుకుంటున్నారు.

సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 20.87 లక్షల మంది పురుషులు కాగా 30 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే 18 కోట్లు అదాయం వచ్చి చేరుతుంది. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా సోమవారం 11.74 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అంటే అర కోటి మంది ప్రయాణిస్తే.. అనుకున్నంతగా వచ్చే ఆదాయం కంటే రూ. 6.16 కోట్లు తక్కువ అని తెలుస్తోంది. అది కూడా 60శాతం మంది మహిళలు ఫ్రీ బస్సును వినియోగించుకున్నారు కాబట్టే.. ఈ మొత్తం తక్కువ వచ్చింది. ఇక సోమవారం వచ్చిన రూ. 11.74 కోట్లు ఆదాయం కూడా 20.87 లక్షల మంది పురుషులు తమ ప్రయాణానికి టికెట్ కొనుగోలు ద్వారా వచ్చింది.
ఇక అటు జిల్లాలవారీగా చూసినా మహిళలు రికార్డు స్థాయిలో ఫ్రీ బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు సగటున రెండు లక్షల పైగా మహిళలు జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేస్తున్నట్లుగా ఆర్టీసీ సంస్థ గుర్తించింది. బస్సు ఆక్యుపెన్సిలో 70శాతం మహిళలే ప్రయాణం చేస్తున్నారు. గత వారం మొత్తం కార్తీక మాసం కావడంతో పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు మహిళలు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాళేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేస్తున్నారు. ఓవరాల్‌గా అందివచ్చిన అవకాశాన్ని అతివలు అద్భుతంగా వినియోగించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..