AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ఆమెరికాకు చెందిన అమ్మాయితో షర్మిళ కుమారుడు రాజారెడ్డి ప్రేమ వ్యవహారం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

YS Sharmila: ఆమెరికాకు చెందిన అమ్మాయితో షర్మిళ కుమారుడు రాజారెడ్డి ప్రేమ వ్యవహారం
Ys Sharmila Son Raja Reddy
Nalluri Naresh
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 13, 2023 | 12:46 PM

Share

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాలు సైతం ఒప్పుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్, అట్లూరి మాధవి దంపతుల కుమార్తె ప్రియా. అట్లూరి కుటుంబం అమెరికాలో స్థిరపడ్డప్పటికీ వారి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా. అట్లూరి శ్రీనివాస్ ది విజయవాడ. అయితే భార్య మాధవిది ఎన్టీఆర్ జిల్లాలో స్వగ్రామం పెనుగంచిప్రోలు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ప్రియకు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ చీర పెట్టిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో రాజారెడ్డి చేసుకునే అమ్మాయి ఈమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అనే అమ్మాయిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని తెగ ప్రచారం జరుగుతుంది.

అయితే వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియ ఎవరు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్నేహితుడే అట్లూరి శ్రీనివాస్. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్‌కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉంది. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుంది.

అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె ప్రియను వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డికి అమెరికాలోనే పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియ ఎవరు అనే దానిపై చాలా మందికి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో చట్నీస్ రెస్టారెంట్ యజమాని కుమార్తె ప్రియా అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు. దీంతో ఇప్పుడు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియ ఎవరు అనేదానిపై ఒక క్లారిటీ వచ్చింది. త్వరలోనే అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతులు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నది తెలుసే అవకాశం ఉంది.

ఇదిలావుంటే ఆ మధ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద కూతురును రాజారెడ్డికి ఇచ్చి పెళ్ళి చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. తర్వాత ఈ కామెంట్స్ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఇప్పుడు రాజారెడ్డి, ప్రియ పెళ్లి పిలుపు వార్త వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా జగన్, షర్మిల మధ్య మాటలు లేవు. మరి ఈ పెళ్లికి జగన్ ఫ్యామిలీ హాజరవుతుందా? లేదా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…