AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భర్తతో గొడవ పడి భార్య ఆత్మహత్య.. వెలుగులోకి అసలు నిజం..!

హైదరాబాద్‌ మహానగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad: భర్తతో గొడవ పడి భార్య ఆత్మహత్య.. వెలుగులోకి అసలు నిజం..!
Woman Ends Life
Balaraju Goud
|

Updated on: Jul 31, 2026 | 11:24 AM

Share

హైదరాబాద్‌ మహానగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీర్‌పేట్ పరిధిలో నివాసం ఉంటున్న హేమ (28) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబంలో నెలకొన్న సమస్యలు, మనస్పర్థల కారణంగా కొంతకాలంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. హేమ భర్త రాజ్‌కుమార్ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. భర్త తనను మానసికంగా వేధించేవాడని, ఆ వేధింపులు తట్టుకోలేకే హేమ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై పోలీసులు అధికారికంగా నిర్ధారణకు రాలేదు. ఘటనకు అసలు కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మృతురాలి ఫోన్ వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాలు, విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు తీవ్ర పరిణామాలకు దారితీయకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us