AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్‌ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట

Mobile diesel tanker:వినియోగ దారులు తమకు అవసరమైన వస్తువులను దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో వినియోగ దారుల ముంగిటకే సంస్థలు తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఆన్ లైన్ ద్వారా అవసరమైన వస్తువులను వినియోగ దారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతులకు అవసరమైన డీజిల్ కూడా వారి ముంగిటకు వస్తోంది.

Telangana: ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్‌ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట
Telangana News
M Revan Reddy
| Edited By: Anand T|

Updated on: Oct 23, 2025 | 4:38 PM

Share

సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రత్యేకత ఉంది. రైతుల కళ్లాల దగ్గరకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఇతర అవసరాలను కూడా తీర్చాలని సొసైటీ భావించింది. అంది వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం (PACS) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ముఖ్యమైన డీజిల్ కొనుగోలు చేసి ఇంట్లో నిలువ చేసుకుంటారు. అయినా డీజిల్ సరిపోక ఇబ్బంది పడుతుంటారు. దీంతో డీజిల్ కోసం దూరంలో ఉండే పెట్రోల్ బంక్‌ల వద్దకు వెళుతుంటారు. ఒక్కోసారి బంక్‌లలో నో స్టాక్ అనే బోర్డు కూడా ఉంటుంది. రైతులకు డీజిల్ కష్టాలను దూరం చేసేందుకు రైతుల వద్దకే డీజిల్ ను అందుబాటులోకి తీసుకురావాలని PACS భావించింది.

ఈ లక్ష్యంతో మొబైల్ డీజిల్ ట్యాంకర్ ను ప్రారంభించింది. అత్యాధునిక హంగులతో మొబైల్ డీజిల్ ట్యాంకర్ ను రూపొందించారు. మొబైల్ డీజిల్ ట్యాంకర్ తో గ్రామాల్లో రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు ఇంటివద్దకే వెళ్లి డీజిల్ సరఫరా జరుగుతోంది. దీంతో డీజిల్ కోసం దూరంలో ఉండే పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లకుండా తమ ముంగిటకే డీజిల్ సరఫరా కావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.

ఫోన్ చేసి తమకు అవసరమైన డీజిల్ ను ఆర్డర్ చేస్తే చాలు తమ వద్దకే మొబైల్ డీజిల్ ట్యాంకర్ వస్తుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారి మొబైల్ డీజిల్ ట్యాంకర్ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ప్రారంభమయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నడిగూడెం సహకార సంఘం లాభాలబాటలో నడుస్తూ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. రైతులకు అవసరమైన మరిన్ని సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు.

Mobile Diesel

Mobile Diesel

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!