AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?

కుటుంబ కలహాలో, హత్య కేసులో, లేదా భూ వివాధాలో ఇలా ఏదో ఒక వివాదంలో కోర్టు నుంచి నోటీసులు రావడం కామన్. ఇక్కడో మహిళకు మాత్రం తన ఫ్రెండ్‌ను గాజుల పండుగకు పిలవలేదని నోటీసు వచ్చింది. స్థానిక జనాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిన ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.

Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
Telangana News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 23, 2025 | 4:16 PM

Share

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు మహిళా సంఘం ఆధ్వర్యంలో స్నేహితులకు గాజులు వేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ప్రతి రోజు కలిసే స్నేహితులు స్థానికంగా ఉండే మహిళలను పిలిచి వారందూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన కోంపల్లి అనిత అనే మహిళను ఈ కార్యక్రమానికి పిలవడం మిగతా స్నేహితులు మర్చిపోయారు. దీంతో తీవ్ర అసంతృప్తికి చెందిన అనిత తనను ఎందుకు పిలువలేదో చెప్పాలని కోర్టును అశ్రాయించారు. ఆమె పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ ప్రతివాదులకు నోటీసులు కూడా జారి చేసింది.

తాను మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, గత కొన్నీ సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్నానని.. కానీ సంఘం వాళ్లు మాత్రం గాజుల పండగ కార్యక్రమానికి తనను పిలవలేదని ఆమె పేర్కొంది. తనను ఎందుకు పిలవలేదో, తనను పిలవకపోవటానికి కారణం ఏంటో సంఘ సభ్యులు చెప్పాల్సిందిగా నోటిసులు పంపింఛానని కోర్టును కోరింది. దీంతో కోర్టు సంఘ సభ్యులు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు చూసిన సంఘం సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే సంఘం సభ్యుల వాదన మరోలా ఉంది. స్నేహితులందరం కలిసి గాజుల పండగ చేసుకున్నామని, ఈ కార్యక్రమానికి అనితను పిలిచినా.. పిలవలేదని నోటీసులు పంపించడం ఏంటని వారు అంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి కాని.. ఇలా నోటీసులు పంపించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..