AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త స్కామ్

హైడ్రా కమిషర్ రంగనాథ్ పేరుతో జరిగిన ఓ బిగ్‌ స్కామ్ బయటకొచ్చింది. నగరంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సృష్టించినట్టు తెలంగాణ ఇంటర్మీడియేట్‌ బోర్డ్‌ గుర్తించింది. ఇంగర్మీడియట్ అధికారుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త స్కామ్
Hydra Commissioner Ranganath Signature Forged
Anand T
|

Updated on: Aug 05, 2026 | 11:44 AM

Share

హైదరాబాద్‌ పరిధిలోని కబ్జాకి గురైన చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన సంస్థ హైడ్రా. అయితే ఈ సంస్థకు కమిషన్‌ర్‌ విధులు నిర్వహిస్తున్న రంగనాథ్ గత కొన్ని రోజులుగా కబ్జా కోరుల నుంచి ప్రభుత్వ భూములతో పాటు చెరువులను స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తమ భూములను కాపాడుకునేందుకు కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్‌ NOCలు సృష్టించిన సృష్టించినట్టు తేలడం ఇప్పుడు నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

నగరంలోని సుమారు 8 ప్రైవేట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ NOCలు సృష్టించాయని. వాటితో ఇంటర్మీడియేట్‌ బోర్డ్‌కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాయని అధికారులు గుర్తించారు. ఈ డాక్యుమెంట్స్‌పై అనుమానం వచ్చి ఆరా తీయగా అవి నకిలీ ఫైర్ NOCలుగా బయటపడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ 8 ప్రైవేట్ కాలేజీల ఫోర్జరీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్‌ సైతం ఈ కాలేజీల గుర్తింపును రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీ లిస్ట్‌లో బర్కత్‌పురాలోని హైందవీ జూనియర్ కాలేజీ, SR నగర్‌లోని రెసోనెన్స్‌ జూనియర్‌ కాలేజీ, మెహిదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజీ , విద్యానగర్‌లోని మదర్స్ గాళ్స్‌ జూనియర్ కాలేజీ , చంద్రాయణగుట్టలోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ , చిక్కడపల్లిలోని న్యూఎరా జూనియర్ కాలేజీ , శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజీ, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజీలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us