AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏం చెప్పిందంటే?

పెళ్లికి ముందు లైంగిక సంబంధాల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పులు వెలవరించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని తేల్చి చెప్పింది. 2014 నాటి కేసు ఆధారంగా క్యారెక్టర్ బాగాలేదంటూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తిరస్కరించిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

Supreme Court: పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏం చెప్పిందంటే?
Supreme Court Judgment On Relationships
Anand T
|

Updated on: Jun 08, 2026 | 2:55 PM

Share

పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలకతీర్పు వెల్లడించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని , వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్టు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2014లో నమోదైన కేసు ఆధారంగా క్యారెక్టర్ బాగాలేదంటూ ఓ వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తిరస్కరించిన కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎక్కువ మంది చదివినవి:కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా అందాన్ని పెంచుకోండి

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్‌కు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడు స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (SCTPC) పోస్టుకు ఎంపికయ్యాడు. అయితే తన అప్లికేషన్ ఫారమ్‌లోనే అతను గతంలో తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసు గురించిన వివరాలను నిజాయితీగా వెల్లడించాడు. తన గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపి, ఆ తర్వాత అతను మరొకరిని వివాహం చేసుకోవడంతో సదరు యువతి తిరుపతితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది చదివినవి: బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే.. అవి దరిదాపుల్లోకి కూడా రావు

దీన్ని తిరుపతి సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తిరుపతి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఇద్దరు మేజర్ల అంగీకారంతో కలిసుంటే నైతిక పతనంగా భావించమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తిరుపతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us