AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్బీఐలో 7,150 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి మరో ఛాన్స్! డిగ్రీ పాస్ అర్హత..

SBI Apprentice Recruitment 2026: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు State Bank of India (ఎస్‌బీఐ) తన బ్రాంచీల్లో భర్తీ చేయనున్న 7,150 అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించింది. గత నెలలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం జూన్ 8, 2026తో ముగియాల్సిన దరఖాస్తు ప్రక్రియను తాజా ప్రకటన మేరకు జూన్ 15, 2026 వరకు పొడిగించారు. దీంతో ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులకు మరో అవకాశం లభించింది..

ఎస్బీఐలో 7,150 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి మరో ఛాన్స్! డిగ్రీ పాస్ అర్హత..
SBI Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 08, 2026 | 2:33 PM

Share

దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచుల్లో 7,150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు జూన్‌ 8, 2026వ తేదీ అంటే నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఎస్బీఐ దరఖాస్తు ప్రక్రియ గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు దరఖాస్తు ప్రక్రియను జూన్‌ 15 వరకు పొడిగించింది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 709 పోస్టులు, తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, సమగ్ర శిక్షణను అందించడం లక్ష్యంగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు డిగ్రీ (గ్రాడ్యుయేషన్) అర్హతతోపాటు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో ప్రావీణ్యం కూడా కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష జులై 2026 నెలలో ఉంటుంది.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఎలా ఉంటుందంటే?

రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై 25 ప్రశ్నల చొప్పున 25 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన విభాగాలు ఇంగ్లిష్, హిందీతో పాటు అభ్యర్థి ఎంచుకున్న ప్రాంతీయ భాషల్లో కామవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తెలుగులో పరీక్ష రాయవచ్చు. నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు అంటే 0.25 చొప్పున మార్కుల కోత ఉంటుంది. అభ్యర్ధులు 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల జాబితాలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు ఆధారాలు చూపిస్తే.. ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐలో 7,150 అప్రెంటిస్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us