అవార్డు వచ్చిన ఆనందంలో రాంబాయి.. కట్టిపడేస్తున్న తేజస్వి ఫోటోస్..

Rajitha Chanti

Pic credit - Instagram

08 June 2026

రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి పాత్రలో తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసిన నటి తేజస్వి (Tejaswi) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.

ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ‘రాంబాయి’ పాత్రలో ఆమె పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తాజాగా తేజస్వి కెరీర్‌లో ఒక మైలురాయిని అందుకున్నారు. ఓ ఛానల్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఆమె ‘ఉత్తమ నటి’ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకున్నారు.

తన నటనకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో ఆమె ఎంతో ఆనందంలో మునిగిపోయారు. అవార్డు అందుకున్న ఆ సంతోష క్షణాలకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా పంచుకున్నారు.

 ఈ ఫోటోలలో ఆమె అవార్డును చేతబట్టుకుని ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన  వైరల్ అయ్యాయి.

సెలబ్రిటీలు, సహనటులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. రాంబాయి పాత్రలో మీరు అద్భుతంగా నటించారు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ 2025 నవంబర్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

కేవలం కల్పిత ప్రేమకథలా కాకుండా సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాకు సాయిలు కాంపాటి దర్శకత్వం వహించారు.