చేపలు తింటే నిజంగానే తెలివి పెరుగుతుందా? పరిశోధనలో ఆసక్తిరనమైన విషయాలు
Krishna
08 June 2026
చేపల్లో ఉండే DHA మెదడు కణాల సంభాషణకు, సమాచార ప్రాసెసింగ్‌కు కీలకం. ఇది మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే రావాలి. అందుకు చేపలే అత్యంత ఉత్తమమైన వనరు.
మెదడుకు మేత
క్రమం తప్పకుండా చేపలు తినే పిల్లలు, తినని వారి కంటే సగటున 4.8 ఐక్యూ పాయింట్లు ఎక్కువగా సాధిస్తున్నట్లు రీసెర్చ్‌లో తేలింది. అప్పుడప్పుడు తినే పిల్లలు కూడా 3.31 ఐక్యూ పాయింట్లు ఎక్కువగా సాధించారు.
ఐక్యూ పెరుగుదల
చేపలు తినడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మంచి నిద్ర వల్ల నిద్రలోనే మెదడు జ్ఞాపకాలను పటిష్టం చేసుకుని, సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. దీన్ని వల్ల రెట్టింపు వేగంతో ఐక్యూ పెరగడానికి తోడ్పడుతున్నాయి.
సూపర్ నిద్ర
చేపల ప్రయోజనాలు కేవలం బాల్యంతోనే ఆగిపోవు. వయసు పైబడిన వారు ఎక్కువ చేపలు తినడం వల్ల చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
మతిమరుపు దూరం
చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వృద్ధాప్యంలో మెదడు కణాలకు వచ్చే స్వల్ప స్థాయి వాపులను తగ్గిస్తాయి.. అంతేకాకుండా దశాబ్దాల పాటు మెదడు కణాలకు రక్త ప్రసరణ సజావుగా సాగేలా చూస్తాయి.
బ్రెయిన్ వాపు
ఎక్కువగా చేపలు తినేవారి మెదడు నిర్మాణాన్ని స్కాన్ చేయగా.. తినని వారితో పోలిస్తే వారిలో మెదడులోని వివిధ భాగాలను కలిపి ఉంచే వైట్ మ్యాటర్ ఫైబర్‌లు చాలా బలంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
మెదడు నిర్మాణం
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. క్యాప్సూల్స్ మింగడం కంటే నేరుగా వండుకుని తినే నిజమైన చేపల నుండే మానవ శరీరం DHAను సమర్థవంతంగా గ్రహిస్తుంది
ట్యాబ్లెట్లు వేస్ట్
మాకెరెల్, సార్డిన్ల లాంటి కొవ్వు ఎక్కువ ఉండే చేపల్లో DHA అత్యధికంగా ఉంటుంది. మలేషియా మార్కెట్లలో చాలా తక్కువ ధరకే దొరికు ఇండియన్ మాకెరెల్ ఇకాన్ కెంబంగ్ అత్యధికంగా DHA కలిగిన చేపలలో ఒకటిగా నిలిచింది.