AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా అందాన్ని పెంచుకోండి

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ వారి ఆహారపు, అలావాట్లు, జీవనశైలి కారణంగా కొన్ని సార్లు ముఖంపై మొటిమలు వచ్చి అందాన్ని పాడు చేస్తుంటాయి. వాటిని వదిలించుకోవడానికి జనాలు అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇవేవి ఇంట్లో దొరికే ఒక్క పదార్థంలో అందంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం పదండి.

Beauty Tips: కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా అందాన్ని పెంచుకోండి
Beautiful Skin
Anand T
|

Updated on: Jun 07, 2026 | 8:15 AM

Share

మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మన ఇంట్లో దొరకే పటిక ఎంతో ప్రభావవంతంగా పనిస్తుంది. పటికను శాస్త్రీయంగా పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని పిలుస్తారు. పూర్వం రోజుల్లో, చెరువులు, బావులు, కాలువల నుండి తెచ్చిన నీటిని శుద్ధి చేయడానికి దీనిని విస్తృతంగా ఉపయోగించేవారు. బకెట్ నీటిలో కొద్దిగా పటిక వేస్తే, మట్టి కణాలన్నీ అడుగుకు చేరి, నీరు స్వచ్ఛంగా తయారయ్యేది. ఈ నీటి శుద్ధి గుణం పటిక ప్రాథమిక ప్రయోజనాలలో ఒకటి.

చర్మ సంరక్షణలో పటిక పాత్ర

సహజ యాంటీసెప్టిక్: పూర్వం, మంగలి షాపులలో షేవింగ్ చేసిన తర్వాత పటిక రాళ్లను ఉపయోగించేవారు. షేవింగ్ వల్ల ఏర్పడే చిన్నపాటి గాయాలను నయం చేయడానికి, బ్యాక్టీరియా చేరకుండా నిరోధించడానికి పటిక అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అల్యూమినియం అయాన్‌లు రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేసి, రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. ఇది సహజమైన ఆఫ్టర్ షేవ్ లోషన్ లాగా పనిచేస్తుంది, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చర్మాన్ని రక్షిస్తుంది.

ముడతలు నివారణ: పటిక చర్మానికి ముడతలు రాకుండా రక్షించడంలో సహాయపడుతుంది. ఇది ఒక మైల్డ్ ఇరిటెంట్‌గా పనిచేసి, చర్మ కండరాలను బిగుతుగా చేస్తుంది. దీనివల్ల చర్మం సాగకుండా, వదులుగా మారకుండా ఉంటుంది. ముఖం, మెడ, చేతులపై పటికను రుద్దడం వల్ల చర్మం టైట్‌గా మారుతుంది, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.

మొటిమలు, మచ్చలకు పరిష్కారం:మొటిమలు, యాక్నే సమస్యలతో బాధపడేవారికి పటిక ఒక అద్భుతమైన పరిష్కారం. పటికలో ఉండే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ బ్యాక్టీరియా కణ పొరపై ఉండే ప్రోటీన్‌ను దెబ్బతీసి, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది మొటిమలు తగ్గిన తర్వాత గుంటలు లేదా మచ్చలు ఏర్పడకుండా కూడా సహాయపడుతుంది.

మృత కణాల తొలగింపు, చర్మ కాంతి: పటిక డెడ్ సెల్ లేయర్‌ను సమర్థవంతంగా తొలగిస్తుంది. మృత కణాలను తొలగించడం ద్వారా చర్మం పునరుజ్జీవింపబడుతుంది, కాంతివంతంగా మారుతుంది. ఇది ఒక సహజసిద్ధమైన స్క్రబ్‌గా పనిచేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.అలాగే జిడ్డు చర్మం ఉన్నవారికి పటిక చాలా ఉపయోగపడుతుంది. పటికను అప్లై చేయడం వల్ల ఆయిల్ గ్రంథులు నియంత్రించబడి, నార్మల్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది చర్మ రంధ్రాలను తెరిచి, చెమట బయటకు వెళ్లిపోయేలా చేసి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

పటికను ఎలా ఉపయోగించాలి?

రోజ్ వాటర్‌తో: పటిక పొడిని రోజ్ వాటర్‌లో కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. నూనెతో ప్యాక్: పటిక పొడిని ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో కలిపి జిడ్డుగా ప్యాక్‌లాగా చేసుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్‌గా పెట్టుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మొటిమలు, యాక్నే సమస్యలు తగ్గుతాయి.

మరిన్ని  లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us