Telangana: తెలంగాణ బిల్లుల పెండింగ్‌ కేసు క్లోజ్.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం సుప్రీంకోర్టులో కొలిక్కి వచ్చింది. తెలంగాణ గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌లో పెట్టారన్న కేసు విచారణను సుప్రీంకోర్టు ముగించింది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Telangana: తెలంగాణ బిల్లుల పెండింగ్‌ కేసు క్లోజ్.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 25, 2023 | 6:24 AM

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం సుప్రీంకోర్టులో కొలిక్కి వచ్చింది. తెలంగాణ గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌లో పెట్టారన్న కేసు విచారణను సుప్రీంకోర్టు ముగించింది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలో ఓ కీలక వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడ్డట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య బిల్లుల విషయంలో వివాదం తలెత్తడంతో.. టీ.సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను క్లియర్ చేసేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా.. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తమిళిసై తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్‌ వద్ద పెండింగ్‌ బిల్లులు లేనందున కేసు పరిష్కారం అయినట్లు సీజేఐ ధర్మాసనం ప్రకటించింది. కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. రాజ్యాంగం ప్రకారం బిల్లులకు సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరినట్లు గవర్నర్ తరఫు న్యాయవాది వాదించగా.. కీలక బిల్లులను తిప్పి పంపారని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. బిల్లులు తిప్పి పంపాలంటే వీలైనంత వెంటనే పంపొచ్చని, కానీ.. తన వద్దనే పెండింగ్‌లో పెట్టుకోవడం సరైంది కాదని కోర్టుకు తెలిపారు.

దాంతో.. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు బిల్లులను తిప్పి పంపే అధికారం ఉందని నొక్కి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గవర్నర్లు కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ప్రస్తుతం బిల్లులు పెండింగ్‌లో లేనందున కేసు విచారణను ముగిస్తున్నట్లు చెప్పింది. అయితే.. కొంతకాలంగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య గ్యాప్‌ పెరిగింది. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఇబ్బందిపడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. కొన్ని బిల్లుల విషయంలో కావాలానే గవర్నర్ జాప్యం చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే