Dog Attack: తెలుగు రాష్ట్రాల్లో ఆగని వీధి కుక్కల దాడులు.. బెంబెలెత్తిపోతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. రోజురోజుకీ ఇవి పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వీధి కుక్కలపై ప్రజల్ని బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డెక్కాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా.. వరంగల్ డిప్యూటీ మేయర్ డివిజన్‌లోనే కుక్కల స్వైర విహారం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

Dog Attack: తెలుగు రాష్ట్రాల్లో ఆగని వీధి కుక్కల దాడులు.. బెంబెలెత్తిపోతున్న ప్రజలు
Dogs
Follow us
Aravind B

|

Updated on: May 25, 2023 | 4:30 AM

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. రోజురోజుకీ ఇవి పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వీధి కుక్కలపై ప్రజల్ని బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డెక్కాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా.. వరంగల్ డిప్యూటీ మేయర్ డివిజన్‌లోనే కుక్కల స్వైర విహారం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. వరంగల్‌లో అయేషా అనే పదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. అలాగే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. స్థానిక అయ్యప్పనగర్‌కాలనీకి చెందిన రెహమాన్‌ అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో..కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు

అయితే వీధి కుక్కల స్వైర విహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని కామారెడ్డి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడులలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా.. వీధి కుక్కల దాడుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం