South Central Railway: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. కీలక ప్రకటన చేసిన దక్షిణ మధ్య రైల్వే..
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ని తాత్కాలికంగా
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇవాళ రాత్రి 23.45 గంటల నుంచి రేపు(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్న కారణంగా ఈ రెండు రోజులు అర్థరాత్రి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లోని ఛార్జింగ్, కరెంట్ బుకింగ్, పిఆర్ఎస్ ఎంక్వైరీ, పీఆర్ఎస్ క్యాన్సిలేషన్, రిఫండ్ వంటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటించారు. ఈ సమయంలో ఉన్న రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కరెంట్ బుకింగ్ వంటి సేవలు మాన్యువల్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Also read:
Kerala High Court: ఆ హక్కు భర్తకు లేదు.. వైవాహిక అత్యాచారంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేరళ హైకోర్టు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్ కోటా..