AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తెలంగాణలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!

Telangana: ఆత్మహత్యలు పెరగడానికి కారణాలు అనేకం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పోటీతత్వం, లాంగ్ అవర్స్ మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఒత్తిడికి చికిత్స లేకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మానసిక సమస్యలతో ఆత్మహత్యలు గణనీయంగా ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి..

Telangana: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తెలంగాణలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
Mental Stress
Sravan Kumar B
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 7:59 PM

Share

Telangana: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో 35 ఏళ్ల వెంకటేష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అంత పిరికివాడు కాదు, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియదు అని చెబుతున్నారు. ఘటనా స్థలానికి క్లూస్‌ టీమ్‌తో చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యల్లో 2025లో దేశంలో 4వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు పోలీసులు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు ఈ ట్రెండ్‌ను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

2025 ఏప్రిల్ శంకర్పల్లిలో ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి అప్పులతో హన్మంత్రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబాల్లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. 2025 జనవరి రాజేంద్రనగర్ లో పెళ్లి అయిన 3 వారాలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరుణ్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. 2026 ఫిబ్రవరి లో హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. 2026 మార్చిలో కొండాపూర్‌లో మనుశ్రీ (32) పని ఒత్తిడితో ఉరివేసుకుంది. మానసిక నిపుణులు పని ఒత్తిడి, కలహాలు, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఐటీ హబ్‌ల సమీపంలో ఇలాంటి ఘటనలు తరచూ నమోదవుతున్నాయి.

ఆత్మహత్యలు పెరగడానికి కారణాలు అనేకం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పోటీతత్వం, లాంగ్ అవర్స్ మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఒత్తిడికి చికిత్స లేకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మానసిక సమస్యలతో ఆత్మహత్యలు గణనీయంగా ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి. పోలీసులు వెంకటేష్ కేసులో మొబైల్ రికార్డులు, సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. కుటుంబం, సహోద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు 20% పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు కౌన్సెలింగ్ తీసుకోవాలి. 104 హెల్ప్‌లైన్ కి కాల్‌ చేయొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
టాటా కారు వాడుతున్నారా? ఈ 30 సర్వీసులు ఉచితం..అదిరిపోయే డిస్కౌంట్
టాటా కారు వాడుతున్నారా? ఈ 30 సర్వీసులు ఉచితం..అదిరిపోయే డిస్కౌంట్
RCB vs DC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విక్టరీ
RCB vs DC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విక్టరీ
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
వాహనదారులకు సర్‌ఫ్రైజ్‌.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!
వాహనదారులకు సర్‌ఫ్రైజ్‌.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!