AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ నిధులు మీకు అందలేదా..? ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.. అంతా ఫ్రీ..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను ఇవాళ విడుదల చేయగా.. రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్నాయి. అయితే మీకు అన్ని అర్హతలు ఉండి నిధులు అందకపోతే ఫిర్యాదు చేయవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఇదెలా అనేది చూద్దాం.

PM Kisan: పీఎం కిసాన్ నిధులు మీకు అందలేదా..? ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.. అంతా ఫ్రీ..
Pm Kisan 24th Installment
Venkatrao Lella
|

Updated on: Oct 30, 2026 | 1:09 PM

Share

పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. లబ్దిదారుల అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ చేశారు. గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగిన సభలో 24వ విడత సొమ్మును రిలీజ్ చేశారు. ఈ నిధులను విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ పథకం దేశంలోని కోట్లామంది రైతుల జీవితాల్లో వెలుగు నింపిందని అన్నారు. ఈ విడతలో మొత్తం 93.4 మిలియిన్ల మంది రైతులకు రూ.18,690 కోట్లు బదిలీ చేశారు. దీపావళికి పండుగకు మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పండుగ కానుకగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. అయితే పీఎం కిసాన్ అందకపోతే ఏం చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనేది చూద్దాం.

ఈ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి

మీకు అర్హత ఉండి పీఎం కిసాన్ నిధులు అందకపోతే కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఎప్పుడైనా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 155261 (టోల్-ఫ్రీ) లేదా 011-24300606 ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ఇక కిసాన్ ఈ-మిత్ర వాట్సప్ చాట్ బాట్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్‌లో ఈ చాట్ బాట్ అందుబాటులో ఉంటుంది. ఇక మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవల కేంద్రం అనర్హులులగా తేలిన 10 లక్షల మందిని ఈ స్కీమ్ లబ్దిదారుల జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. దీంతో మీ అర్హతలను ఒకసారి పరిశీలించుకోవాలి.

ఎటువంటి పరిస్థితుల్లో నిలిచిపోవచ్చు

-అర్హులైనవారి పేరుపై సాగు భూమి కలిగి ఉండాలి

-ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు కుటుంబసభ్యులకు ఈ ప్రయోజనం అందదు. కేవలం ఒక్కరికి మాత్రమే అందుతుంది

-భూమి రికార్డులు పీఎం కిసాన్ పోర్టల్‌లో సీడింగ్ అయి ఉండాలి

-కేవైసీ పూర్తి చేసి ఉండటంతో పాటు బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయి ఉండాలి

-మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్ష కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు

-కుటుంబసభ్యులు ఎవ్వరూ రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండకూడదు

-ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు

-కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే ఇది వర్తించదు

-నెలకు రూ.10 కంటే ఎక్కువ పించన్ పొందుతున్నవారు

-వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్టుల వంటి వృత్తి నిపుణులకు ఈ పథకం వర్తించదు

Follow Us