AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. పల్టీలు కొడుతూ దూసుకెళ్లిన కారు! సీసీటీవీలో భయానక దృశ్యాలు!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఇన్నోవా కారు ప్రమాదం కలకలం రేపింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ ఓ ఇంటి కాంపౌండ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. పల్టీలు కొడుతూ దూసుకెళ్లిన కారు! సీసీటీవీలో భయానక దృశ్యాలు!
Car Overturns
Balaraju Goud
|

Updated on: Oct 30, 2026 | 1:19 PM

Share

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఇన్నోవా కారు ప్రమాదం కలకలం రేపింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ ఓ ఇంటి కాంపౌండ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

మలుపు వద్ద అదుపుతప్పిన కారు

వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ నుంచి నర్కూడ వైపు ఇన్నోవా కారు వెళ్తుండగా మార్గమధ్యంలోని ఓ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంటి కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టింది. కారు వేగంగా దూసుకెళ్లి గోడను ఢీకొట్టడంతో భారీ శబ్దం వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు

ఈ ప్రమాదంలో కారులో ఉన్న పాండు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని వాహనం నుంచి బయటకు తీసి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ ప్రమాదానికి అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో వాహనదారులు మలుపుల వద్ద వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us