AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: తుఫాన్ వేళ మొబైల్ ఛార్జింగ్‌కు డిమాండ్‌.. రూ.10కు ఓ ఫోన్‌!

అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మొబైల్‌ ఫోన్ల ఛార్జింగ్‌ సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో బంటుమిల్లి మండలం అర్తమూరుకు చెందిన ఓ వ్యాపారి తన జనరేటర్‌తో మొబైల్‌ ఛార్జింగ్‌ సదుపాయం కల్పించారు. ఒక్కో ఫోన్‌కు రూ.10 తీసుకుంటూ స్థానికులకు అందుబాటులో ఉంటున్నారు.

Krishna District: తుఫాన్ వేళ మొబైల్ ఛార్జింగ్‌కు డిమాండ్‌.. రూ.10కు ఓ ఫోన్‌!
Phone Charging
M Sivakumar
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 1:22 PM

Share

తుఫాన్ వచ్చింది.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయింది. ప్రకృతి విపత్తు కారణంగా కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కొత్త సమస్య ఎదురైంది. గంటల తరబడి కరెంట్ లేకపోవడంతో ఇళ్లలో చీకట్లు అలుముకున్నాయి. మరోవైపు ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కష్ట సమయంలో బంటుమిల్లి మండలం అర్తమూరులో ఓ వ్యాపారి వినూత్న ఆలోచన చేశారు. తన దగ్గరున్న జనరేటర్‌తో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే సదుపాయం కల్పించారు.

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్లలో ఉన్న మొబైల్ ఫోన్ల బ్యాటరీలు కూడా నెమ్మదిగా అయిపోయాయి. సాధారణ రోజుల్లో ఫోన్ ఛార్జింగ్ పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ తుఫాన్ వంటి విపత్తుల సమయంలో అదే అత్యవసరంగా మారుతుంది. కుటుంబ సభ్యుల క్షేమసమాచారం తెలుసుకోవాలన్నా, తమ పరిస్థితిని బంధువులకు తెలియజేయాలన్నా, అత్యవసర సహాయం కోరాలన్నా మొబైల్ ఫోన్ అవసరం.

ఈ పరిస్థితిని గమనించిన అర్తమూరుకు చెందిన ఓ వ్యాపారి తన జనరేటర్‌ను ఉపయోగించి మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఒక్కో ఫోన్‌కు రూ.10 చొప్పున తీసుకుంటూ ఛార్జింగ్ పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తమ ఫోన్లతో అక్కడికి చేరుకుంటున్నారు. ఛార్జింగ్ పెట్టించుకుని మళ్లీ ఫోన్లు ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు.

ఫోన్ ఆన్ అయితే చాలు.. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. తమ క్షేమసమాచారం తెలియజేయవచ్చు. అత్యవసర సమాచారం తెలుసుకోవచ్చు. అందుకే రూ.10 చెల్లించి అయినా ఫోన్ ఛార్జింగ్ చేయించుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకవైపు తుఫాన్ ప్రభావం.. మరోవైపు విద్యుత్ అంతరాయం.. ఇలాంటి సమయంలో జనరేటర్‌తో ఏర్పాటు చేసిన చిన్నపాటి ఛార్జింగ్ కేంద్రం స్థానికులకు ఉపయోగకరంగా మారింది. సాధారణ రోజుల్లో పెద్దగా పట్టించుకోని మొబైల్ ఛార్జింగ్.. ప్రకృతి విపత్తుల సమయంలో ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. కష్టకాలంలోనూ ఓ వ్యాపార అవకాశాన్ని గుర్తించిన ఈ వ్యాపారి ఆలోచన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us