AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: దీపావళికి ముందే సామాన్యులకు భారీ ఊరట.. ఒక్కసారిగా దిగొచ్చిన కూరగాయల ధరలు.. రేట్లు ఇవే..

దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ ధరల తగ్గింపు సామాన్యులకు గొప్ప ఊరటనిస్తోంది, కూరగాయల ధరలు తగ్గడంతో పండుగ వేళ వారికి ఆర్థిక భారం తగ్గినట్లయింది. పండక్కి ముందు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఇలా..

Vegetable Prices: దీపావళికి ముందే సామాన్యులకు భారీ ఊరట.. ఒక్కసారిగా దిగొచ్చిన కూరగాయల ధరలు.. రేట్లు ఇవే..
Vegetable Prices
Venkatrao Lella
|

Updated on: Oct 30, 2026 | 12:39 PM

Share

దీపావళి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన కూరగాయల ధరలు.. పండుగ సందర్భంగా ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో సామాన్యులు, గృహిణులకు ఊరట చెందుతున్నారు. కూరగాయల ధరలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తోంది. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే రైతు బజార్లలో ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో రైతు బజార్లకు వెళ్లి తీసుకుంటే చౌక ధరకే పొందే అవకాశం ఉంటుంది. దీని వల్ల డబ్బులు ఆదా చేసుకుని గృహ బడ్జెట్ తగ్గించుకోవచ్చు. సాధారణంగా పండుగ సమయాల్లో ధరలు పెరుగుతుంటాయి. కానీ దీపావళి పండక్కి ముందే ఈసారి ధరలు తగ్గడం నిజంగా ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

హైదరాబాద్‌లో నేడు కూరగాయల ధరలు ఇవే..

కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతుబజార్‌లో ఇవాళ కిలో టమాటా రూ.27, వంకాయ రూ.18, బెండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.48, బజ్జీ మిర్చి రూ.60, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.11, ఫ్రెంచ్ బీన్స్ రూ.55, క్యారెట్ రూ.45, కాలీఫ్లవర్ రూ.30, దొండకాయ రూ.23 పలుకుతున్నాయి. ఇక కేజీ చిక్కుడుకాయ రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్‌రూట్ రూ.25, క్యాప్సికం రూ.50, బంగాళాదుంప రూ.23, స్థానిక కీరదోస రూ.35కు లభిస్తున్నాయి. అలాగే ఇటాలియన్ కీరదోస రూ.35, దోసకాయ రూ.22, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.24, కందగడ్డ రూ.26, ఉల్లికాడలు రూ.55, ఉల్లిపాయలు రూ.40కు విక్రయిస్తున్నారు. ఇక మామిడికాయ రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతోండగా.. అరటిదూట రూ.9 నుంచి రూ.10, చామగడ్డ రూ.38, ముల్లంగి ఒక్కటి రూ.6 నుంచి రూ.8కి అమ్ముతున్నారు. అటు చిలగడదుంప రూ.40, గుమ్మడికాయ రూ.40, నిమ్మకాయలు డజను రూ.50 నుంచి రూ.60, మునగకాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.12లకు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. బొప్పాయి రూ.50, పుట్టగొడుగులు 200 గ్రాములు రూ.50, ఎండుమిర్చి రూ.280, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120 ధర పలుకుతుండగా.. కిలో వెల్లుల్లి రూ.260, చింతపండు రూ.160, ఎర్ర మిరపకాయలు రూ.80, ఉసిరికాయలు రూ.60, కరివేపాకు రూ.60, వేరుశనగ రూ.55, అలసందలు రూ.40గా కొనసాగుతున్నాయి.

విజయవాడలోని రైతు బజార్లలో ధరలు ఇలా..

విజయవాడలో కిలో టమాట రూ.39, వంగ రూ.20, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.38, కాకర రూ.32, క్యాబేజీ రూ.25, క్యారెట్ రూ.46, దొండ రూ.16, బంగాళదుంప రూ.26, ఉల్లిపాయలు రూ.39, గోరుచిక్కుడు రూ.24, దోస రూ.24, చిక్కుళ్లు రూ.56, బీర రూ.35, చామదుంప రూ.32, కంద రూ.34, బీట్ రూట్ రూ.36, కీరదోస రూ.42, బీన్స్ రూ.88, క్యాప్చికం రూ.66, అలసందలు రూ.40, చిలకడదుంప రూ.46 పలుకుతున్నాయి.

Follow Us
పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు
పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు
మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!
మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!
బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే
లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..
కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్
కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్
ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..
ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..
రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి
రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి
మీ వాట్సాప్ ఖాతాను వేరొకరు వాడుతున్నారా?
మీ వాట్సాప్ ఖాతాను వేరొకరు వాడుతున్నారా?
వెంకీ అండ్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా మెప్పించిందా..?
వెంకీ అండ్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా మెప్పించిందా..?