AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Hulchul: నడుస్తూ ఉండగా వృద్దుడి కాళ్లను చుట్టేసిన విష సర్పం.. విడిపించుకున్నాక అతడు ఏం చేశాడో చూడండి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల జంగపల్లి గ్రామంలో విష సర్పం కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లోన్న....

Snake Hulchul: నడుస్తూ ఉండగా వృద్దుడి కాళ్లను చుట్టేసిన విష సర్పం.. విడిపించుకున్నాక అతడు ఏం చేశాడో చూడండి
Snake Hulchal
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2021 | 11:56 AM

Share

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల జంగపల్లి గ్రామంలో విష సర్పం కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లోన్న వ్యక్తిపై ఒక్కసారిగా పాము ఎటాక్‌ చేసింది. గడ్డమీది రాజయ్య అనే వ్యక్తిని ఎటూ కదలనీయకుండా కాళ్లను చుట్టేసింది. ఒక్కసారిగా పాము చుట్టుకోవడంతో రాజయ్య భయపడలేదు. మరొకరి సాయంతో పామును మెల్లగా వదలించుకున్నాడు. పాము ఎలా రాజయ్యను ఎలా చుట్టుకుంటుందో మీరు ఒక్కసారి చూడండి.

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎలా వచ్చిందో తెలియదు. కానీ రోడ్డుపై నడస్తున్న రాజయ్యను పాము చుట్టేసింది. చూస్తేనే పాము ఆరు అడుగుల ఉంది. పైగా బలంగా ఉంది. కాలును చుట్టేసి రాజయ్యను ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు రాజయ్య మరొకరి సాయంతో ధైర్యంగా పామును విడిపించుకోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత పాము పట్టుకుని తలను మలిచి భూమిపై పడేసి కర్రతో కొట్టి చంపేశాడు వృద్ధుడు రాజయ్య.  శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో జరిగింది. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ప్రాణ భయంతోనే పామును చంపేసినట్లు రాజయ్య తెలిపాడు.

Also Read: దారుణం.. 300 వీధి కుక్కలకు విషం.. చనిపోయిన అనంతరం కూడా

విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. ఎక్కడంటే..?