Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana’s SLBC Tunnel: జులై చివరి నుంచి SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణ..12 నుంచి ప్రత్యేక సర్వే..!

టన్నెల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తి చేయడానికి రక్షణ శాఖ సహకారం కోరింది తెలంగాణ ప్రభుత్వం..ఈమేరకు ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులను తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,అధికారులు కలిశారు..SLBC సొరంగం పూర్తి చేయడానికి ఆర్మీ,ఎయిర్ ఫోర్స్ సహకారం ఇవ్వాలని రక్షణ శాఖ అధికారులను కోరారు..దీనికి అంగీకరించిన రక్షణ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

Telangana's SLBC Tunnel: జులై చివరి నుంచి SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణ..12 నుంచి ప్రత్యేక సర్వే..!
Slbc Tunnel Project Resumes
Follow us
Gopikrishna Meka

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 11, 2025 | 9:10 PM

దేశంలో అతి పెద్ద సొరంగ మార్గపు ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్​ఎల్​బీసీ) ప్రాజెక్టు నిర్మాణ పనులు జూలై నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి కేంద్ర రక్షణ శాఖ సహకారం తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం.. మొత్తం 44 కిలోమీటర్ల టన్నల్ లో 35 కి.మీ పూర్తికాగా గత ఫిబ్రవరిలో టన్నల్లో కొంత భాగం కూలిపోవడంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి.. టన్నెల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తి చేయడానికి రక్షణ శాఖ సహకారం కోరింది తెలంగాణ ప్రభుత్వం..ఈమేరకు ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులను తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,అధికారులు కలిశారు..SLBC సొరంగం పూర్తి చేయడానికి ఆర్మీ,ఎయిర్ ఫోర్స్ సహకారం ఇవ్వాలని రక్షణ శాఖ అధికారులను కోరారు..దీనికి అంగీకరించిన రక్షణ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

SLBC టన్నెల్ పై ఎలక్ట్రో మాగ్నాటిక్ సర్వే

SLBC సొరంగం పూర్తి చేయాలంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి ఏ విధంగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలో ముందస్తుగా ఒక ఆధునిక సర్వేను ప్రభుత్వం నిర్వహించనుంది..అందుకోసం జులై 12న ఎలక్ట్రో మాగ్నాటిక్ సర్వే ను నిర్వహించనున్నారు..డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రో మాగ్నాటిక్ సర్వే పరికరాలను అద్దె విధానంలో తీసుకుని..SLBC సొరంగ మార్గం మొత్తం 44 కి.మీ భూ పైనుంచే భూమి లోపల 1కి.మీ వరకు అన్ని విషయాలు తెలుసుకునేలా ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మాగ్నాటిక్ పరికరాలను అమర్చి సర్వే జరపనున్నారు.. భూమి పై నుంచి తక్కువ ఎత్తులో ఎగిరే ఆర్మీ హెలికాప్టర్ కు 42 మీటర్ల దిగువన 26 మీటర్ల వ్యాసార్థంలో ట్రాన్స్ మీటర్ లూప్ , మాగ్నెటో మీటర్,రిసీవర్ లూప్ ద్వారా భూమి లోపల ఒక కి.మీ వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.. ఇందుకోసం వైమానిక దళ హెలికాప్టర్లు, పవన్ హన్స్ హెలికాప్టర్ల సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.. భూ లోపలి పొరలు, నీటి ధారలు,భూ పరిస్థితులను తెలుసుకునేలా ఈ సర్వే ఉంటుంది..ఈ సర్వే వల్ల సొరంగం వాస్తవ పరిస్థితి తెలుసుకోవచ్చు.శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున హెలికాప్టర్ సర్వే చేసి తదుపరి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ఇందు కోసం ఆర్మీ, వైమానిక సహకారాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం..భారత ఆర్మీ లో ఉన్న కల్నల్ పరీక్షిత్ మెహరా, సరిహద్దు రోడ్డు సంస్థ మాజీ డిజి జనరల్ హర్పాల్ సింగ్ ను తెలంగాణ కి డిప్యుటేషన్ పై పంపేందుకు కేంద్రం అంగీకారాన్ని తెలిపింది ..ఉత్తరాఖండ్ హిమాచల్ లో రోహతాంగ్, సీలా సొరంగాలు నిర్మించడంలో ఈ ఇద్దరు అధికారులు నిష్ణాతులు…పరీక్షిత్ మెహరా ను నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా , జనరల్ హారపాల్ సింగ్ ని గౌరవ సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది..ఈ ఇద్దరి సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన అన్ని సొరంగాలు నిర్మాణాలు పూర్తి చేయనుంది..ఎన్జిఆర్ఐ నిష్ణాతుడు ప్రొఫెసర్ తివారీ సహకారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోనుంది..ధన్బాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ సహకారం సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది ..వీరి వద్ద ఉన్న అత్యంత అధునాతన టన్నల్ టెక్నాలజీ వినియోగించనున్నాము. దీనికి సంబంధించి కూడా చర్చలు ముగిశాయి.SLBC లో ఇంకా పెండింగ్ లో ఉన్న 9 కి.మీ పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతుంది..జులై 12 నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుంది. వారం రోజుల్లో సర్వే పూర్తి కానుంది.. ఈ సర్వేకు 2 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఇందుకోసం డెన్మార్క్ నుంచి వచ్చే సర్వే పరికరాలన్ని అద్దెకు తీసుకోనున్నారు.. సర్వే అనంతరం జూలై చివరి నుంచే 9 కి.మీ సొరంగం పనులు ప్రారంభించి వచ్చే రెండేళ్లలో సొరంగం పనులు పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం..టన్నల్ తవ్వకాల్లో బోరింగ్ మెషిన్ కంటే అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు.ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న టీబీఎం ఇక పనికిరాదు.టీబీఎం తీయడానికి సాధ్య పడటం లేదు కాబట్టి… కూలిపోయిన సొరంగ భాగంలో కొంత వెనుక నుంచి లూప్ తోసుకుని పక్క నుంచి సొరంగం తవ్వకాన్ని చేపట్టనున్నారు..ఎస్​ఎల్​బీసీ సొరంగం పనులు టీబీఎంతో తవ్వకాలు అసాధ్యం అని, బ్లాస్టింగ్‌, డ్రిల్లింగ్‌ విధానంలో తవ్వకాలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు సూచనలు చేశారు.ఇకపై బ్లాస్టింగ్ టెక్నాలజీ ఉపయోగించి టన్నెల్ తవ్వకాలను పూర్తించేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు..మొత్తం ఎస్​ఎల్​బీసీ సొరంగం 43.93 కిలోమీటర్లు పొడవు కాగా ఇన్‌లెట్‌ వైపు నుంచి 13.93 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. ఔట్‌లెట్‌ వైపు నుంచి 20.49 కిలోమీటర్లు తవ్వారు. మిగిలిన 9.53 కిలోమీటర్లు ఇంకా తవ్వాల్సి ఉంది..బ్లాస్టింగ్‌, డ్రిల్లింగ్‌ విధానంలో రెండు వైపుల నుంచి ప్రాజెక్టు పనులు కొనసాగనున్నాయి.

భవిష్యత్లో సీతారామ, దేవాదుల, ఇంకా పెండింగులో ఉన్న అన్ని టన్నల్ ప్రాజెక్టులకు కొత్త టెక్నాలజీ ఉపయోగించి.. పూర్తి చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.. శ్రీశైలం నుంచి ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్ కి నీటి సరఫరా కోసం SLBC సొరంగం 20 ఏళ్ల క్రితం మొదలైంది.. ప్రస్తుత అంచనాల ప్రకారం రూ. 4,500 కోట్ల ఖర్చు తో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది..మొత్తం 44కి.మీ SLBC సొరంగ నిర్మాణం ఉంటుంది.. ఈ ప్రాజెక్టు ద్వారా 3-4 లక్షల ఏకరాల కొత్త ఆయకట్టు కు నీరు అందుతుంది..బిఆర్ఎస్ హయంలో పనులు నిచిపోయిన తరువాత కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సమయంలో ఫిబ్రవరి 22న టన్నెల్ మధ్య భాగం కూలి పలువురు ఇంజనీర్లు సహా కార్మికులు చనిపోయారు..ఇప్పటికీ 8 మంది ఆచూకీ తెలియరాలేదు.. ప్రమాదం లో చనిపోయిన వారందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం సైతం చెల్లించింది..20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి కేంద్ర సహకారం ..అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ప్రాజెక్టు ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..