తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు! ఎవరికి ఏం ఇచ్చారంటే..?
తెలంగాణ ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి వంటి మంత్రులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, మైనింగ్, పశు సంవర్ధక, యువజన, క్రీడా శాఖలను పొందారు. ఈ కేటాయింపులు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జరిగాయని తెలుస్తోంది.

New Ministers
తెలంగాణలో ఇటీవలె మంత్రి పదువులు పొందిన వారికి ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఒక్కో మంత్రికి రెండు శాఖల చొప్పున కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, గడ్డం వివేక్‌కి కార్మిక, మైనింగ్, వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక, యువజన, క్రీడా శాఖలు కేటాయించారు. అయితే కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై నిన్నంత చర్చలు జరిగినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం మేరకు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..