AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: శంకర్‌లక్ష్మిని మరోసారి పశ్నించిన అధికారులు.. కీలక ఆధారాలు సేకరించిన సిట్‌

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. ఓ వైపు విచారణ చేపబడుతూనే మరోవైపు నిందితులను అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. ఇవాళ మరోసారి శంకర్‌లక్ష్మిని విచారించిన సిట్‌ అధికారులు, కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

TSPSC: శంకర్‌లక్ష్మిని మరోసారి పశ్నించిన అధికారులు.. కీలక ఆధారాలు సేకరించిన సిట్‌
TSPSC
Sanjay Kasula
|

Updated on: Mar 30, 2023 | 9:23 PM

Share

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు కార్యాలయానికి పిలిచి శంకరలక్ష్మి నుంచి వివరాలు సేకరించిన అధికారులు, షమీమ్, రమేష్ చెప్పిన వివరాలను నిర్ధారించుకోవడానికి మరోసారి ఆమెను ప్రశ్నించారు. శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్ వర్డ్‌ను ప్రవీణ్, రాజశేఖర్ దొంగిలించి కంప్యూటర్ లోకి లాగిన్ అయ్యారని, కంప్యూటర్‌లో ఉన్న పేపర్‌లను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారని ఇప్పటిదాకా నిర్ధారించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌ను ప్రవీణ్, షమీమ్,రమేష్‌కు ఇచ్చారు. సురేష్, ప్రశాంత్ రెడ్డికి, రాజశేఖర్‌ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినట్లు గుర్తించారు. తమకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని షమీమ్, రమేష్ అడిగినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తమకు ప్రశ్నాపత్రం ఇవ్వాలని షమీమ్ అడిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అనుమానాలపై సిట్‌ అధికారులు శంకరలక్ష్మి నుంచి మరిన్ని వివరాలు రాట్టినట్లు సమాచారం.

మరోవైపు ఎల్బీనగర్ లోని షమీమ్ నివాసంలో సిట్‌ అధికారులు గంటసేపు సోదాలు నిర్వహించారు. ప్రశ్నాపత్రం లీకేజీ తరువాత ఇంటి నుంచి ఎవరెవరితో మాట్లాడిందనే వివరాలు సేకరించారు. సురేష్, రమేష్..షమీమ్ ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చారనే వివరాలు సేకరించారు. షమీమ్ నివాసంలో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చిన రాజశేఖర్ రెడ్డి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌, మహబూబ్‌నగర్‌జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన టీచర్‌ రేణుకను నిందితులుగా సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే