AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరిష్ఠ స్థాయికి చేరుకున్న తెలంగాణ విద్యుత్ డిమాండ్.. ఒకే రోజులో 15,497 మెగావాట్ల వినియోగం

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గతంలో మార్చి 15న 15.062 మెగవాట్ల గరిష్ఠ స్థాయి నమోదైంది.

గరిష్ఠ స్థాయికి చేరుకున్న తెలంగాణ విద్యుత్ డిమాండ్.. ఒకే రోజులో 15,497 మెగావాట్ల వినియోగం
Electricity
Aravind B
|

Updated on: Mar 30, 2023 | 8:39 PM

Share

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గతంలో మార్చి 15న 15,062 మెగావాట్ల గరిష్ఠ స్థాయి నమోదైంది. ఈసారి గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 15,497 మెగావాట్లకు చేరుకోగా..గత ఏడాది మార్చిలో గరిష్ఠంగా 14,160 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే మార్చి 15న 15,062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ గిరిష్ఠ స్థాయికి చేరుకోగా ఆ తర్వాత వర్షం కారణంగా కొంతమేర తగ్గిందని..ఆ తర్వాత మరోసారి పెరిగినట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్ల మార్కును అధిగమిస్తుందని..రోజువారి ఇంధన వినియోగం 300 మిలియన్ యూనిట్లకు మించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్చిలో గరిష్ట డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేసిన తరువాత విద్యుత్ వినియోగ శాఖ తగినంత విద్యుత్ సరఫరాకు ప్రణాళిక వేసింది. రాష్ట్ర మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో వ్యవసాయ పరిశ్రమ 37 శాతానికి పైగా విద్యుత్ ను వినియోగిస్తోంది. వేసవిలో వినియోగదారులందరికీ, ముఖ్యంగా రైతులకు నమ్మకమైన విద్యుత్‌ను పొందేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!